Home జాతీయ వార్తలు మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol And Diesel Prices Increase In Indiaన్యూఢిల్లీ: వరుసగా మూడో రోజూ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.  రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 35 పైసల చొప్పున పెంచాయి. ఈ క్రమంలో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.89కి చేరగా, డీజిల్‌ ధర రూ.95.62కు పెరిగింది. ఇక ముంబయిలో పెట్రోల్‌ రూ.112.78, డీజిల్‌ రూ.103.36, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.107.45, డీజిల్‌ రూ.98.73, చెన్నయ్ లో పెట్రోల్‌ రూ.103.92, డీజిల్‌ రూ.99.92కి చేరాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.18, డీజిల్‌ రూ.104.32గా ఉన్నది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంపై వినియోగదారులు భగ్గమంటున్నారు. చమురు ధరలను అదుపు చేయాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.