Home తాజా వార్తలు రెండు నెలల తర్వాత స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు

రెండు నెలల తర్వాత స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol-diesel price hike after almost 2 months

న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలల విరామం తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 17 పైసలు, డీజిల్‌పై లీటరుకు 22 పైసల చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలలో మార్పులే ఈ ధరల పెరుగుదలకు కారణమని చమురు కంపెనీలు తెలియచేశాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 81.06 నుంచి రూ. 81.23కు పెరుగగా డీజిల్ ధర రూ. 70.46 నుంచి రూ. 70.68కి పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 తర్వాత పెట్రోల్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 2 తర్వాత డీజిల్ ధరలలో పెరుగుదల ఇదే ప్రథమం. మారిన ధరల ప్రకారం ముంబయిలో లీటరు పెట్రోల్ ధర 87.74 నుంచి రూ. 87.92కి పెరిగింది. డీజిల్ ధరలు రూ. 76.86 నుంచి రూ. 77.11కి పెరిగింది.చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 84.31, కోల్‌కతాలో రూ. 82.79గా ఉంది.