Home తాజా వార్తలు పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.5 పెరగొచ్చు!

పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.5 పెరగొచ్చు!

Petrol, diesel prices

 

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్ క్రూడ్ (ముడి చమురు) రేటు ఒక్కసారిగా పెరిగింది. ఇది భారత్‌పై ప్రభావం చూపనుందని, పెట్రోలు ధరల పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ వారంలో పెట్రోలు, డీజిల్ రేట్లు రూ.5 నుంచి 6 వరకు పెరిగే అవకాశముందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్‌కు చెందిన వెబ్‌సైట్లు తెలిపాయి. ప్రస్తుత స్థాయి వద్ద ముడి చమురు ధరలు కొనసాగితే రిటైల్ ఔట్‌లెట్లలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగవచ్చని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొంది. కాగా సోమవారం బ్యారెల్‌కు 12 డాలర్లు (20 శాతం) పెరిగింది.

ఇది ఇప్పటివరకు డాలర్‌లో అత్యధికం, 28 సంవత్సరాలలో ఇది అతిఎక్కువ. ఆ తర్వాత ఇది 6 డాలర్లు (10 శాతం) పెరుగుదలతో కనిపించింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి 71 పైసలు పతనమై 71.63కు చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు భారత చమురు కంపెనీలకు రెట్టింపు ఎదురుదెబ్బ అని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కంపెనీలు పెంచవచ్చని అంటున్నారు. ఎందుకంటే భారతదేశం తన చమురు అవసరాలకు 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటోంది. గత 15 రోజుల్లో క్రూడ్, రూపాయి డాలర్ల మారకపు రేటు ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్- రేట్లను నిర్ణయిస్తాయి. చమురు దిగుమతులు ఖరీదైనవి కావడంతో కంపెనీలు పెట్రోల్ రేట్లను పెంచుతాయి.

ఎందుకు చమురు ధరలు పెరిగాయి?
ప్రపంచంలోనే అత్యంత భారీగా చమురు సరఫరాలు చేసే దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. శనివారం సౌదీలోని అరామ్‌కో ప్లాంట్లపై డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో మంటలు వ్యాపించి రోజుకి 5.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తికి బ్రేక్‌పడింది. ప్రపంచ చమురు సరఫరాలలో 5 శాతం వాటాను కల్గి ఉన్న ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి నిలిచిపోవడంతో ఒక్కసారిగా చమురు ధరలకు పెరిగాయి. అటు లండన్ మార్కెట్లో బ్రెంట్, ఇటు న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ ధరలు 10 శాతం స్థాయిలో ఎగశాయి.

Petrol, diesel prices may jump Rs 5, 6 per liter