Home తాజా వార్తలు 36 రోజుల తర్వాత పెరిగిన పెట్రో ధరలు

36 రోజుల తర్వాత పెరిగిన పెట్రో ధరలు

petro

న్యూఢిల్లీ: నెల రోజులకు పైగా తగ్గుతూ వస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం పెరిగాయి. 36 రోజుల తర్వాత పెట్రోల్ ధర లీటరుకు 16పైసలు పెరగ్గా, డీజిల్‌పై 12పైసలు పెరిగింది. ఈ నెల రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర 22 సార్లు తగ్గగా, డీజిల్ ధర 18 సార్లు తగ్గింది. రోజువారి ధరల మార్పులో భాగంగా ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి రూ.75.71గా ఉంది. లీటరు డీజిల్ ధర 12పైసలు పెరిగి రూ.67.50కు చేరింది. ఇతర ప్రముఖ నగరాలతో పోలిస్తే ఢిల్లీలోనే ధరలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయంగా రేట్లను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉత్పత్తి పెంపునకు ఒపెక్ నిర్ణయాన్ని ఊహించి కొద్ది రోజులుగా పెట్రో ధరల్లో మార్పులు చేయలేదని, ఇరాన్ చమురు సమస్య కారణంగా పరిస్థితిలో మార్పు వచ్చిందని ఐఒసి చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతి రోజూ ధరలు సవరిస్తాయి. ఈ ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.