Thursday, March 28, 2024

డెల్టా వేరియంట్‌పై ఫైజర్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ప్రభావం తక్కువే

- Advertisement -
- Advertisement -
Pfizer-Covishield vaccines less effective against Delta variant
ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడి

లండన్ : ఆల్పా వేరియంట్‌తో పోల్చుకుంటే డెల్టా వేరియంట్‌పై ఫైజర్, కొవిషీల్డ్ వాక్సిన్ల ప్రభావం తక్కువ గానే ఉంటోందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే డెల్టా వేరియంట్ నుంచి ఈ వ్యాక్సిన్లలో ఏ వ్యాక్సిన్ రెండు డోసుల నుంచైనా ఒకేస్థాయిలో రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈమేరకు 18 ఏళ్లు అంతకన్నా పెద్ద వయస్సు ఉన్న 3,84,543 మంది గొంతుక, ముక్కు నుంచి నమూనాలు సేకరించి 25,80,021 నమూనాలు పరీక్షించారు. కొవిడ్ సోకకుండా టీకా పొందిన వారి కన్నా కొవిడ్ సోకిన తరువాత టీకా పొందిన వారికి ఎక్కువ రక్షణ కలిగినట్టు గ్రహించారు. అయితే వ్యాక్సిన్ పొందక పోయినా, పొందినా డెల్టా ప్రభావం మాత్రం ఒకే స్థాయిలో కనిపించిందని వివరించారు. వ్యాక్సిన్ పొందిన తరువాత కొవిడ్ సోకిన వారి నుంచి ఎంతవరకు వైరస్ వ్యాపిస్తుందో తమకు తెలియదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సారా వాకర్ పేర్కొన్నారు.

Pfizer-Covishield vaccines less effective against Delta variant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News