Friday, April 19, 2024

చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్ల సురక్షితంపై అధ్యయనాలు

- Advertisement -
- Advertisement -

Pfizer says Covid vaccine effective in children

అమెరికాలో చిన్నారుల్లో 91 శాతం సమర్ధత

వాషింగ్టన్ : చిన్నారులకు వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని అనేక దేశాలు మొదలు పెట్టిన నేపథ్యంలో ఇవి ఎంతవరకు చిన్నారులకు సురక్షితం అనే కోణంలో అధ్యయనాలు సాగుతున్నాయి. చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమేనని అమెరికాలో వాస్తవ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న లక్షల మంది పిల్లలకు ఇప్పటికే ఫైజర్ టీకా అందిస్తున్నారు. ఈ నవంబర్ నుంచే 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు ఫైజర్ టీకా ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పటికే 50 లక్షల మందికి తొలిడోసు అందించారు. ఇప్పటివరకు వారిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణ విభాగం స్పష్టం చేసింది.

ఈ విధంగా 3100 వ్యాక్సిన్ తీసుకున్న వారి సమాచారాన్ని అమెరికా ఆహార ఔషధ సంస్థ విశ్లేషించింది. చిన్నారుల్లో కొవిడ్ నిరోధించడంలో వ్యాక్సిన్ 91 శాతం సమర్ధత చూపిస్తోందని వెల్లడించింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారుల్లో కొందరిలో మాత్రమే జ్వరం, టీకా తీసుకున్న చోట నొప్పి వంటి సమస్యలు కనిపిస్తున్నాయని గుర్తించారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారుల గుండెలో వాపు రావడం అత్యంత అరుదేనని నిపుణులు స్పష్టం చేశారు. 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఇటువంటి ముప్పు అసలే లేదని వెల్లడించారు. కేవలం రెండో డోసు తీసుకున్న తర్వాత కొంతమంది యువకుల్లో మాత్రమే ఇటువంటివి కనిపించాయని అయినా వారు త్వరగా కోలుకుంటున్నట్టు తెలిపారు. భారత్‌లో త్వరలోనే చిన్నారులకు టీకా అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News