Home తాజా వార్తలు ఫార్మారంగానికి అనువైన స్థలం హైదరాబాదే: కెసిఆర్

ఫార్మారంగానికి అనువైన స్థలం హైదరాబాదే: కెసిఆర్

CM KCR Assembly Image

తెలంగాణ: హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు విస్తరించాయని సిఎం కెసిఆర్ తెలిపారు. శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ… దేశంలో 45 శాతం ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఫార్మా రంగానికి అనుకూల వాతావరణం ఉందన్నారు. హైదరాబాద్‌కు నలుమూలలా మరిన్ని ఫ్యాక్టరీలు విస్తరించాల్సిన అవసరముందని చెప్పారు. హైదరాబాద్ టు వరంగల్ హైవేను ఇండస్ట్రియల్ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.