Home తాజా వార్తలు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి!

ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి!

Pregnancy

 

గర్భం దాల్చిన తరువాత మహిళల్లో శారీరక, ఆరోగ్యపరమైన మార్పులు రావడం సహజం. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వీటికి తోడు వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, టైఫాయిడ్, హెపటైటిస్, జలుబు వంటి సీజనల్ వ్యాధులు గర్భిణులను సతమతం చేస్తుంటాయి. ఈ శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.

ద్రవ పదార్థాలు తీసుకోండి: వాతావరణం చల్లగా ఉందని చెప్పి నీళ్లు తాగడం తగ్గిస్తారు చాలామంది. ఈ సీజన్‌లో కూడా ఎక్కువ మోతాదులో ద్రవపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవడం ముఖ్యం. వేడి చేసి చల్లార్చిన నీళ్లు లేదా శుద్ధిచేసిన నీళ్లను మాత్రమే తాగాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, చెరకు రసం తాగినా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
శుభ్రత పాటించండి: సలాడ్స్‌లో పచ్చి కూరగాయ ముక్కలు తినొద్దు. అలానే ఉడకబెట్టని మాంసం, గుడ్లు, సీ ఫుడ్ గర్భిణులు తినకూడదు. ఆకుకూరలు, క్యాబెజీ వంటి కూరగాయల మీద ఎక్కువ మురికి ఉంటుంది. వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తరువాతనే వంటకు ఉపయోగించాలి.

వదులుగా ఉండాలి: వదులుగా, నిండుగా ఉన్న కాటన్ దుస్తులు సరైన ఎంపిక. ఇవి ధరిస్తే గాలి తగులుతుంది. సింథటిక్ వస్త్రాలు, బిగుతైన దుస్తులు అసౌకర్యంగా ఉండడమే కాదు ఒంటి మీద మచ్చలు కలిగిస్తాయి. సౌకర్యంగా ఉండే ఫుట్‌వేర్ వాడాలి. దోమ కాటుకు దూరంగా ఉండాలి: ఇంటి సమీపంలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. దోమలు మలేరియా, డెంగ్యూ వంటి జబ్బుల్ని కలిగిస్తాయి. దోమల్ని నివారించేందుకు దోమ తెరలు, కిటికీలకు మెష్ ఏర్పాటు చేసుకోవాలి.

Physical and health changes in women after pregnancy