Tuesday, April 23, 2024

బిఎస్6 శ్రేణిలోకి పియాజియో త్రీవీలర్

- Advertisement -
- Advertisement -

Piaggio three-wheeler

 

హైదరాబాద్ : ఇటాలియన్ పియాజియో గ్రూప్ అనుబంధ సంస్థ పియాజియో వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్(పివిపిఎల్) బిఎస్6 శ్రేణి త్రీవీలర్ తయారీని చేపట్టనుంది. బిఎస్6కు అప్‌గ్రేడ్ అయిన తొలి దేశీయ త్రీవీలర్ పియోజియోనే కావడం విశేషం. పుణేలో కంపెనీకి చెందిన బిఎస్6 ఉత్పాదనలను ప్రదర్శించారు. ‘ద పర్‌ఫార్మెన్స్ రేంజ్’ పేరిట డీజిల్, ప్రత్యామ్నాయ ఇంధన శ్రేణిని ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచారు. కెడబ్లు పవర్, 23.5 ఎన్‌ఎం టార్ క్యూను అందించే 599సిసి ఇంజిన్‌తో కూడిన సంపూర్ణ నూతన పవర్ ప్యాక్‌కు చెందిన డీజిల్ శ్రేణి కూడా ఇందులో ఉంది.

5 స్పీడ్ గేర్ బాక్స్, నూతన అల్యూమీనియం క్లచ్‌తో కూడిన ఇంజిన్ అనేది వాహనం లోడ్ మోసుకెళ్లే సామర్థాన్ని గణనీయంగా పెంచుతుంది. వేగంగా మరిన్ని ట్రిప్పులు పూర్తి చేసేందుకు తోడ్పడుతుంది. అప్‌గ్రేడ్ చేసిన కార్గో శ్రేణి మరింత పెద్దదైన క్యాబిన్‌తో ఉంటుంది. పివిపిఎల్ ఎండి, సిఇఒ డెగో గ్రాఫీ మాట్లాడుతూ, కంపెనీకి చెందిన అన్ని ఉత్పాదనల్లోనూ బిఎస్6 వాహనాలను అందించడం ద్వారా దేశంలో మొదటి త్రీవీలర్ తయారీ సంస్థగా అవతరించడం తమకెంతో ఆనందాన్ని కల్గిస్తోందని అన్నారు.

Piaggio three-wheeler into BS6 range
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News