Saturday, April 20, 2024

సూర్య గొప్ప నటుడు

- Advertisement -
- Advertisement -

సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాలెంటైన్స్ డేని దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం గురువారం సినిమాలోని రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘పిల్ల పులి…’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ఒక నిమిషం వీడియోను కూడా విడుదల చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్లు సూర్య, అపర్ణా బాలమురళి మధ్య రొమాన్స్ అందరినీ అలరిస్తోంది. జి.వి. ప్రకాష్ సంగీతం సమకూర్చిన ఈ పాటలో సూర్య డాషింగ్ లుక్‌లో కనిపిస్తుంటే… అపర్ణ స్టన్నింగ్ లుక్‌లో ఆకర్షణీయంగా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ సాంగ్‌ను ఆకాశంలో స్పైస్ జెట్ విమానంలో లాంచ్ చేయడం విశేషం. ఒక పోటీ ద్వారా ఎంపిక చేసిన అగరం ఫౌండేషన్‌కు చెందిన 100 మంది అండర్ ప్రివిలేజ్డ్ బాలలు, చిత్ర బృందం సమక్షంలో దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధ కొంగర మాట్లాడుతూ “సూర్య నాకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇచ్చారు. నా శాయశక్తులా సినిమాను బాగా తీశాను. నా కలం నిజం కావడంలో తోడ్పడిన నటీనటులకు, సాంకేతిక బృందానికి నా థాంక్స్. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగా మా నాన్న మరణించారు. మోహన్ బాబు రూపంలో ఒక కొత్త నాన్నను నేను దత్తత తీసుకున్నాను. నా విషయంలో ఎంతో శ్రద్ధ చూపించిన ఏకైక వ్యక్తి ఆయనే”అని అన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ “2000 సంవత్సరంలో కేవలం 1 శాతం మందే విమానంలో ప్రయాణించగల స్థితిలో ఉండేవాళ్లు. కెప్టెన్ గోపీనాథ్ వచ్చి ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేశారు. సాధారణ వ్యక్తి కూడా ఆకాశంలో ప్రయాణించగలిగేలా చేశారు. ఈ మూవీ ఆయనకే అంకితం. ఈ సినిమా సాధ్యపడటానికి సుధ పదేళ్ల కాలం వెచ్చించారు. ఇది ఆమె సినిమా. ఈ సినిమాకు వచ్చే పేరు, ప్రశంసలు ఆమెకే దక్కాలి”అని చెప్పారు. మోహన్ బాబు మాట్లాడుతూ “శివాజీ గణేశన్ తర్వాత తమిళంలో బెస్ట్ యాక్టర్ శివకుమార్. ఇప్పుడు ఆయన తనయుడు సూర్యతో కలిసి నటించాను. అతను ఎంతో గొప్ప మనిషి. సూర్యని చూసి శివకుమార్ గర్వించాలి. అలాంటి గొప్ప నటుడు అతను. సుధ క్రమశిక్షణ కలిగిన దర్శకురాలు”అని తెలిపారు.

Pilla Pilla song released from Aakasam Nee Haddhu Ra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News