Home ఆఫ్ బీట్ వీడియోలు గాల్లో విమానం.. కాక్‌పిట్‌లో పైలట్‌ కునుకు…!(వీడియో)

గాల్లో విమానం.. కాక్‌పిట్‌లో పైలట్‌ కునుకు…!(వీడియో)

Pilot sleeping in the cockpitచైనా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌-747 విమానం వేల అడుగుల ఎత్తులో గాల్లో ఉండగానే సీనియర్‌ పైలట్‌ కాక్‌పిట్‌లో ఆదమరిచి కునుకు తీశాడు. దాన్ని కోపైలట్ వీడియో తీయడం… అది కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రమాదమేమీ జరగకపోయినప్పటికీ ప్రయాణికుల అభ్యంతరం మేరకు పైలట్‌తో పాటు మరో ఉద్యోగిపై చర్యలకు ఉపక్రమించింది ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం. కాగా, సదరు పైలట్ కు విమానం నడపడంలో 20 ఏళ్ల అనుభవం ఉందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో పైలట్ నిద్రపోతున్నప్పుడు కోపైలట్‌ వీడియో తీశాడు కానీ అతన్ని నిద్ర లేపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

Pilot caught sleeping in the cockpit while flying Boeing 747