Home అంతర్జాతీయ వార్తలు షాపింగ్‌మాల్‌పై కూలిన విమానం

షాపింగ్‌మాల్‌పై కూలిన విమానం

Plane-Crashసిడ్నీ : ఆస్ట్రేలియాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌లోని ఓ షాపింగ్ మాల్‌పై మంగళవారంనాడు విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మెల్‌బోర్న్‌లోని ఎసెండన్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కొద్ది సెకన్లలోనే ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్ పక్కనే ఉన్న షాపింగ్ సెంటర్‌పై కూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి, అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. బీచ్‌కాండి ఎయిర్‌క్రాఫ్ట్ మెల్‌బోర్న్ నుంచి కింగ్ ఐలాండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అమెరికా టూరిస్టులు ఉన్నారు.