Home రాష్ట్ర వార్తలు విశ్వనగరానికి ప్రణాళికాబద్ధ కృషి

విశ్వనగరానికి ప్రణాళికాబద్ధ కృషి

ktrసిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధ్ది శాఖమంత్రి కె.టి.రామారావు అన్నారు. మునిసిపల్ వ్యవహారాల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంత రం బుధవారం జిహెచ్‌ఎంసి, మునిసిపల్, హెచ్‌ఎండిఎ, మెట్రోరైల్, వాటర్‌బోర్డు తదితర శాఖల ఉన్నతాధికారులతో ట్యాంక్‌బడ్ బుద్ద పూర్ణిమ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశా నికి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం.జి.గోపాల్, జిహెచ్‌ఎంసి కమిష నర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, హెచ్‌ఎంఆర్ ఎం.డి.ఎన్‌విఎస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షలకు అను గుణంగా చిత్తశుద్దితో ప్రణాళికాబద్దంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. నగరంలో వెంటనే ప్రజల అవసరాలను తీర్చేందుకు జిహెచ్‌ఎంసిలోని అన్ని విభాగాలు వందరోజుల ప్రణాళిక, రానున్న ఐదు నుంచి పదేళ్లలో పూర్తిచేసే పనుల దీర్ఘకాలిక ప్రణా ళికలు రూపొందించాలని అధికారులను అదేశించారు. ఇటివల జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో నగర వాసులు తమపై కోటి ఆశలతో ఉన్నారని, నగరవాసుల మనోభావాలను ప్రతిభింభించేలా పనిచే యాలని కోరారు. పౌరసేవలు మరింత సమర్ధవంతంగా అందించడానికి అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేపట్టడానికి తాము సిద్దంగా ఉన్నా మని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని క్లీన్, గ్రీన్, సేఫ్, స్మార్ట్‌సిట్‌లీవబుల్ నగరంగా చేయాలన్నదే తమ ప్రధాన లక్షమని, ఇందుకు రూపొందించే పథకాలన్నింటిలో నగర ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించాలని సూచించా రు. నగరంలో 24 సర్కిళ్లలో టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించాలని అదేశి ంచారు. కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల సభ్యులను ఈ సమావేశాలకు ఆహ్వానించాలని సూచించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ప్రతి డివిజన్‌కు ప్రత్యేకంగా ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాట్సప్ గ్రూపులో అధికారులందరూ చేర్చాలని సూచించారు. ఆయా డివి జన్ల సమస్యలపై ఆయా గ్రూపుల్లోని అధికారులు వెంటనే స్పందించేలా చర్చలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ విభాగాలను అధికారులు మాత్రమే నడిపిస్తున్నారనే భావన ప్రజల్లో ఉందని, దీనిని దూరంచేసి, ప్రజల భాగ స్వామ్యాన్ని కల్పించాలని అన్నారు. పురపాలనలో సాంకేతికతను పూర్తి స్థా యిలో వినియోగించుకోవాలని, నగరంలో రోడ్లపై ఏర్పడే గుంతలు, దెబ్బ తిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూ పొందించుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ప్రత్యేక ప్రధాన్యత ఇవ్వాలని సూచించారు. నగరంలో భవన నిర్మాణ అనుమతులును పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే అందించాలని, ఇందుకు గాను ముందుగా ఒక సర్కిల్‌లో ప్రయోగత్మకంగా ప్రారంభించాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతి రెండు లేదా మూడు కిలోమీటర్లకు ఒక అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించే వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని తెలిపారు. మూసినది ప్రక్షాళనకు చేపట్టాల్సిన మార్గాలను సూచించాల్సిందిగా కోరారు. ప్రభుత్వం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను తన దృష్టికి తీసుకరావాలని, వాటి పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.