Thursday, April 25, 2024

చెరువులకు రక్షణ

- Advertisement -
- Advertisement -

Plans for conservation of ponds in Hyderabad:KTR

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి చెరువు అభివృద్ధికి ఒక మాస్టర్‌ప్లాన్

జిహెచ్‌ఎంసిలో ప్రత్యేకంగా స్పెషల్ కమిషనర్ నియామకం నగరంలోని శివారుల్లోని చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి చుట్టూ వాకింగ్‌ట్రాక్, సుందరీకరణ కాలువల ద్వారా మురుగు మళ్లింపు వంటి చర్యలు కబ్జాకు గురికాకుండా చూసేందుకు దీక్ష శరవేగంగా ప్రణాళిక సిద్ధం శాసనసభలో పలువురి సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి కెటిఆర్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్‌లో పరిధిలో ఇకపై ప్రతి చెరువు అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. దీని కోసం జిహెచ్‌ఎంసిలో ప్రత్యేకంగా ఒక స్పెషల్ కమిషనర్‌ను నియమిస్తున్నామన్నారు.నగర, శివారు ప్రాంతాల్లోని చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించిందన్నారు.వాటిని నిరంతంరం పర్యవేక్షిస్తూనే సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు చేపట్టామన్నారు. ఇకపై చెరువులు కబ్జాకు గురికాకుండా ఉండేందుకు ప్రతి చెరువు అభివృద్ధికి ఒక ప్రణాళిలను అమలు చేస్తామన్నారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, బేతి సుభాష్‌రెడ్డి, అక్బరుద్దీన్ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్ సమాధానమిస్తూ, హైదరాబాద్ పరిధిలోని చెరువుల పరిరక్షణకు శరవేరంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

నగర పరిధిలో మొత్తం185 చెరువులు ఉండగా వాటిల్లో 127 చెరువుల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఇందులో ఇప్పటికే 48 చెరువులను అభివృద్ధి చేశామన్నారు. రూ.407 కోట్ల 30 లక్షలు మంజూరు చేయగా రూ.218 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రూ.94 కోట్ల 17 లక్షల అంచనా వ్యయంతో 63 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టి వాటిలో 48 పూర్తి చేశామన్నారు. అలాగే మిషన్ కాకతీయ అర్బన్ కార్యక్రమం కింద రూ.282 కోట్ల 63 లక్షలతో 19 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి కెటిఆర్ వివరించారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న 45 చెరువుల మరమ్మత్తుల పనులను రూ.30 కోట్ల 50 లక్షలు అంచనా వ్యయంతో జరుగుతున్నాయన్నారు. కబ్జాతో చెరువులు కుంచించుకుపోయాయనేది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలను యుద్దప్రాతిపదికన తొలగిస్తామన్నారు.

100 శాతం

అలాగే రెండేళ్లలో 100 శాతం మురుగనీటిని శుద్ధి చేసి చెరువులను పూర్తిగా పరిరక్షిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. చెరువుల పరిరక్షణలో భాగంగా ఆక్రమణ దారులను తొలగించి సమస్య పరిష్కరిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో 31 సీవరేజ్ ప్లాంటులను ఏర్పాటు చేస్తామన్నారు. నాలాల విస్తరణకు కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెరువుల అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే తప్పకుండా వాటిని స్వీకరిస్తామన్నారు. నాలాలపై ప్రత్యేక దృష్టి సారించి నేపథ్యంలో వాటిపై వెలిసినఅక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు వెంటనే పునరావాసం కల్పించాలని ఆలోచిస్తున్నామన్నారు. నగర, శివారు ప్రాంతాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పేదల కోసం ఇప్పటికే పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టిందన్నారు.

అవసరమైతే ఆ ఇళ్లలో నుంచి 20 నుంచి 25వేల ఇళ్లను మున్సిపల్ శాఖకు కేటాయించాలని సిఎం కెసిఆర్‌తో పాటు సంబంధిత శాఖ మంత్రిని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సిఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆక్రమ నిర్మాణాలను తొలగించి…వాటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కేటాయిస్తామన్నారు.

రేపు గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం

నగర, శివారు ప్రాంతాల్లో చెరువులు, నాలాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. సభ్యులంతా అంగీకరిస్తే బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో నాలాలు, చెరువుల కబ్జాకు గురికాకుండా తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చిద్దామన్నారు. ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించి పలు నిర్ణయం తీసుకుందామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News