Home తాజా వార్తలు మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారం

మానవాళి మనుగడకు మొక్కలే జీవనాధారం

Plants

 

వర్షపాతం తగ్గడానికి కారణం చెట్లు నరకడమే
మొక్కల సంరక్షణను కనీస కర్తవ్యంగా భావించాలి
అంకిరెడ్డిగూడెం హరితహారంలో డిసిపి నారాయణరెడ్డి

చౌటుప్పల్ : మొక్కలే మానవాళి మనుగడకు ప్రధాన జీవనాధారమని యాదాద్రిభువనగిరి జిల్లా డిసిపి కె.నారాయణరెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో శనివారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పరిసరాల్లో మొక్కలు నాటారు. అదేవిధంగా విద్యార్థులు, గ్రామస్థులకు ఆయన పండ్ల మొక్కలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చధనాన్ని నిర్లక్షం చేస్తే భవిష్యత్తులో భూమిపై ప్రాణి కోటికి మనుగడ కరువయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రతియేటా వర్షపాతం అత్యంత దారుణంగా పడి పోవడానికి ప్రధాన కారణం వృక్ష సంపద నశించి పోవడమే నన్నారు.

చెట్లను నరికి అమ్ము కోవడంలో చూపిన చొరవ మొక్కలను నాటి సంరక్షించడంలో కనబరిస్తే ఇలాంటి కరువు పరిస్థితులు తలెత్తేవి కాదన్నారు. అడవుల శాతం గణనీయంగా తగ్గడం వల్లే నేడు కరువుతో పాటు కాలుష్యం పెరి గి పోతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు పచ్చదనం పట్ల నిర్లక్షాన్ని వీడి మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ తమ కనీస కర్తవ్యంగా గుర్తించాలని కోరారు. ఇళ్లలో, గ్రామ పరిసరాల్లోని ఖాళీగా వున్న స్థలాల్లో మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు.

మొక్కలు నాటడం ఎంత ముఖ్య మో.. వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని ప్ర తి ఒక్కరూ గుర్తుంచు కోవాలని డిసిపి నారాయణరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముద్దం సుమిత్ర సత్తయ్య, చౌటుప్పల్ ఎసిపి సత్తయ్య, ఎంపిడిఓ శేషాద్రి, సిఐ పి.వెంకటేశ్వర్లు, వైస్ ఎంపిపి ఉప్పు భద్రయ్య, ఇఓఆర్‌డి శ్రీరాములు, ఎపిఓ ఈశ్వరయ్య, ఉపసర్పంచ్ సప్పి డి చందన, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

దండుమల్కాపురం, ఎల్లగిరి గ్రామాల్లో… చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం, ఎల్లగిరి గ్రామాల్లో శనివారం హరితహారం కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులు కలిసి ఉద్యమంలా చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపిడిఓ శేషాద్రి, సర్పంచులు వెలువర్తి యాదగిరి, రిక్కల ఇందిర సత్తిరెడ్డి, సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, కొత్త పర్వతాలు, యాదగిరి, రవితేజ, సుహాసిని, యాదిరెడ్డి, సంతోష, పద్మ, నర్సి ంహ్మ, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు ప్రజలు ఉన్నారు.

Plants are Lifeblood of Humanity’s Survival