Home యాదాద్రి భువనగిరి హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలి

హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలి

YMK

మన తెలంగాణ/మోత్కూరు : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ బుధవారం మోత్కూరు మండలంలోని పనకబండ, మండల కేంద్రంలోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. మోత్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. నర్సరీల్లో ఏఏ మొక్కలు ఎన్ని పెంచుతున్నారు పెంచిన మొక్కలు ఇక్కడి ప్రాంతానికి సరిపోగా ఇతర ప్రాంతాలకు తర లించే అవకాశాలు ఉన్నాయా అని డిఎఫ్‌వో శ్రీనివా స్‌ను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఈసం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరిత హారం కార్యక్ర మానికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు.

హరిత హారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరిరక్షిం చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలం గాణకు హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయ డానికి అందరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ వెంట డిఆర్ డివో వెంకట్రావ్, డిఎఫ్‌వో శ్రీనివాస్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాదిహామి క్లస్టర్ ఏపిడి శ్యామల, డిప్యూటీ తహశీల్దార్ మామిడి కృష్ణ, మార్కెట్ కార్యదర్శి ఉమా మహేశ్వర్‌రావు, సూపరిండెంట్ సత్యనారాయణ, ఏపివో కరుణాకర్ ఉన్నారు.