Home కరీంనగర్ ప్లాస్టిక్ ప్రతాపం

ప్లాస్టిక్ ప్రతాపం

plasticమనతెలంగాణ సిటి: ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్ ఎటు చూసిన నేడు ప్లాస్టిక్ మయం అయ్యింది. పల్లె పట్టణం తేడా లేకుండా అంతట ప్లాస్టిక్‌నే వినియోగిస్తున్నారు. దీంతో పర్యావరణానికి, పక్షులకు, పశువులకు ప్రాణ సంకటంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నగరపాలక సంస్థలు కాగా ఆదిలాబాద్ ప్రజలకు మున్సిపాలిటీ సేవలందిస్తుంది. అయితే విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడటం వల్ల అనేకానేక అనర్ధాలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాలు పట్టణాన్ని ముంచెత్తుతున్నా యి. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయి నగర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మూగజీవాల పాలిట ప్రాణాంతకంగా మారాయి. పదిహేనేళ్ల వ్యవధిలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడింతలు పెరిగాయి.
నగరాల్లో ఏ చెత్త కుండీల్లో మురుగు కాలువల్లో, ఆట మైదానాల్లో, ఖాళి స్థలాల్లో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్ధాలే దర్శనమిస్తున్నాయి. రెడీమేడ్ ఆహర పదర్ధాల వినియోగం పెరిగేకొద్ది వెలువడే ప్లాస్టిక్ వ్యర్ధాల పరిమాణం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 6వేల టన్నుల మున్సిపల్ చెత్త వెలువడుతోంది. ఇందులో సుమారు 400 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్దాలు ఉంటున్నాయి. అదే 2002 విషయానికొస్తే ప్రతిరోజు సుమారు 6వేల టన్నుల మున్సిపల్ చెత్త వెలువడేది. ఇందులో సుమారు 2,200 టన్నుల మున్సిపల్ చెత్త వచ్చేది. అందులో ప్లాస్టిక్ వ్యర్దాలు 200 టన్నులకు పైగా పెరిగాయి. అది 1.46 లక్షల టన్నులకు చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్లల్లో పట్టణాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోవడం ఖాయమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రాణుల పాలిట యమపాశం
వందల, వేల ఏళ్ల వరకూ మట్టిలో కలిసి పోనిది ప్లాస్టిక్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇది తీపి, ఉప్పు రుచులు కలిగి ఉండడం వల్ల వెంటనే తినే పదార్థం అనే భ్రమ కలిగిస్తుంది. దీంతో పశువులు (ఎక్కువగా ఆవులు, మేకలు, జలజీవాలు) ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకుంటాయి. చిన్నముక్కలైతే విసర్జనలో వెళ్లిపోయినా పెద్దవి మాత్రం కడుపులోనే ఉండిపోయి ప్రమాదకరంగా మారుతాయి. పేగులకు అడ్డం పడతాయి. క్రమంగా గుడ్రంగా ఆకారం సంతరించుకొని కడుపులోనే ఉండిపోతాయి. దీంతో పశువుల జీవనశైలిలో మార్పులు సంభవిస్తాయి. క్రమంగా బలహీనంగా మారతాయి. అలసిపోయినట్లు కనిపిస్తాయి. తర్వాత నీటిని ఎక్కువగా తాగుతుంటాయి. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల ఘన పదార్ధాలను తీసుకునే స్థాయిలో ఉండవు. దీంతో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కడుపులో చేరిన ప్టాస్టిక్ లోపలి పొరలను చీల్చి గాయాలు చేస్తుంది. క్రమంగా ప్రాణులు మృత్యువాత పడతాయి. పక్షులూ ఆహారం కోసం అందుబాటులో ఉండే చిన్నచిన్న ప్లాస్టిక్ వస్తువులను మింగుతాయి. కొద్దిరోజుల్లోనే కదలలేని స్థితికి చేరి మరణిస్తాయి. ఇటీవల ఒక ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త జరిపిన సర్వేలో ఆకారణంగా మరణిస్తున్న పక్షుల్లో నూటికి తొంభై శాతం ప్లాస్టిక్ తీసుకోవడం వల్లేనని గుర్తించారు.
కాలిపోతోంది..
నగరాల్లో వెలువడే మున్సిపల్ చెత్తను నగర శివారుల్లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ వ్యర్ధాలను వేరు చేస్తారు. పున్విరివినియోగానికి పనికి వచ్చే వ్యర్ధాలను పరిశ్రమలకు విక్రయిస్తారు. పనికి రాని వాటిని భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఇలా చేసే వ్యర్ధాల్లో అధిక శాతం ప్లాస్టిక్ వ్యర్ధాలే మున్సిపల్ చెత్తను డంపింగ్ యార్డుకు పంపించేందుకు ఓపిక లేని కొంత మంది పారిశుద్ధ సిబ్బంది దాన్ని బహిరంగ ప్రదేశాల్లో కాల్చేస్తున్నారు. ఇందులో ఆకులు, కాగితపు చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాలూ ఉంటున్నాయి. ఫలితంగా డయాక్సీన్లు, కార్బన్ మోనాక్సైడ్, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ (పీఎహెచ్‌ఎస్), అతి సూక్ష్మ ధూళి కణాలు (ఫిఎం 2.5) సూక్ష్మ ధూళి కణాలు (పీఎం 10) వోలటైల్ ఆర్గానిక్ కంపౌడ్స్ (వీవొసీ) బెంజిన్ తదితర ప్రమాదకర రసాయనాలు గాల్లో కలుస్తున్నాయి. వాటిని పీల్చడం వల్ల క్యాన్సర్‌తో పాటు శ్వాస సంబంధిత వ్యాధులో తలెత్తే ప్రమాదముందని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
పనికి రాదు
ప్లాస్టిక్ వ్యర్ధాలన్నీ పునర్వియోగానికి పనికి రావు. అలా పనికి వచ్చే వ్యర్ధాలను పరిశ్రమల యజమాన్యలు కొనుగోలు చేస్తారు. వస్తువుల తయారీలో తిరిగి వినియోగిస్తారు. ఆహార పదార్ధాలను ప్యాకింగ్ చేసేందుకు వినియోగించిన కవర్లు, గుట్కా పునర్వినియోగానికి పనికి రావు. అందుకే వీటిని పోగు చేసేందుకు చెత్త ఏరుకునే వాళ్లు ఆసక్తి చూపరు. ఫలితంగా ఎక్కడ పడితే అక్కడ పేరుకు పోతున్నాయి. మురుగు కాలువల్లో డ్రైనేజీ ప్రవాహానికి అడ్డు తగులుతున్నాయి. మురికి నీటిలోని ఈ వ్యర్ధాల మీద మలేరియా కారక క్రిములు చేరి వృద్ది చెందుతున్నాయి.
నిషేధం.. తూచ్
2014 జరిగిన మున్సిపల్, నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో 40 మైక్రాన్లలోపు పాలిథిన్ కవర్లను నిషేదించాలని తీర్మానించారు. ఈ కవర్లు ఎక్కువ బరువును మోయలేవు. త్వరగా చిరిగిపోతాయి. చెత్త కాగితాలు ఏరుకునే వారు వీటిని తీసుకెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. ఇవి పునర్వినియోగానికి పనికి రావు. ధర తక్కువ. అందుకే ,చిల్లర వ్యాపారులు ఎక్కువగా వీటిని వినియోగిస్తుంటారు. వీటిలో ఉండే ఆహార పదార్ధాలను తినడంలో భాగంగా ఆ కవర్లనూ పశువులు తింటాయి. 40 మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉన్నవీ పర్యావరణానికీ మంచి చేస్తాయా అంటే అదీ కాదు. కాకపోతే.. వాటిని పోల్చితే ధర ఎక్కువ వీటిని జాగ్రత్తగా వినియోగిస్తారు. ఫలితంగా వాడకం తగ్గుతుందన్నది పర్యావరణవేత్తల వాదన. ఇప్నటికైనా తెలంగాణ జిల్లాలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు స్పదించి నిషేదాన్ని తూచ తప్పకుండా అమలు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మూగ జీవాలు బలి
ఈ నగరానికి ఏమైందీ? ఎక్కడ చూసిన ప్లాస్టిక్ ధూమపానం, కాలుష్యం దర్శనమిస్తున్నవి. మూగ జీవాలకు పచ్చగడ్డి కరువైంది. మనలో చాలా మంది పళ్ల తొక్కలూ, మిగిలిపోయిన రొట్టె ముక్కలూ, పాచిపోయిన అన్నాన్ని పాలథిన్ కవర్లలో పెట్టి చెత్త బుట్టలో పడేస్తారు. నోరులేని పశువులు వాటి రంగు చూసి మోసపోతున్నాయి. పచ్చపచ్చగా ఉంటే పచ్చగడ్డేమో అని భ్రమపడి వాటిని ఆవురావురుముంటూ కవర్లతో సహా మింగేస్తాయి. పాపం.. వాటిని విప్పుకొని తినాలని వాటికేం తెలుసు .. అన్నం అరిగిపోతుంది. తొక్కలు జీర్ణమవుతాయి. ప్లాస్టిక్ కవర్లు మాత్రం అలాగే కడుపులో పేగులకు చుట్టుకు పోతాయి. ఫలితంగా అవి నరకయాతనకు గురవుతాయి. నగరాల్లోని ఒక్కో పశువుల్లో సుమారు 30 కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నట్లుగా తేలింది. ఇదే విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పలుమార్లు ప్రస్తావించారు. కొన్నాళ్ల తర్వాత అవి మృత్యువాత పడుతాయి. ఇదే కారణంతో నగరాల్లో ఏటా వందల సంఖ్యలో మూగ జీవాలు ప్రాణాలే వదిలేస్తున్నాయని నిపుణలు స్పష్టం చేస్తున్నారు.
ప్లాస్టిక్ ముప్పు
ప్లాస్టిక్ వ్యర్దాల్లో పాలధిన్ కవర్లు పర్యావరణానికి హాని చేస్తాయి. మనిషికీ మట్టికీ మద్య అడ్డుగోడలా నిలుస్తాయి. మట్టిలో కలిసిపోయేందుకు వేల సంవత్సారాలు పడుతుంది. వాన నీరు భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడతాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఎంత విస్తారంగా వానలు పడినా నీటికి కటకటే. పాలథిన్ కణాలు మట్టిలోని సత్తు వనంతా మింగిస్తాయి. బంగారం పండే పొలమైనా ఎడారిగా మారుతుంది. పచ్చగడ్డీ మొలవదు. అంతే కాదు భూమిపై ఉన్న పాలిథిన్ కొనేళ్ల తర్వాత ముక్కలైపోయి.. ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతుంది. అది గాల్లో కలిసిపోయి ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఇవన్నీ క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు… ఇంకా అనేకానేక రోగాలకు కారణం అవుతాయి .
ప్లాస్టిక్ వల్ల నష్టాలు
పర్యావరణంతో పాటుగా పశుపక్షాదులకు ప్లాస్టిక్ వల్ల ప్రాణహని ఉంది. ఏటా లక్ష క్షీరదాలు పక్షలు ప్లాస్టిక్ కారణంగా మరణిస్తున్నాయి.
ఒక్కో ప్లాస్టిక్ కవరు ఒక్కో పక్షి, పశువు మరణానికి కారణమవుతుందని సర్వేలో చెబుతున్నాయి. ప్లాస్టిక్ పరికరాల్లో చిక్కుకోని ఊపిరాడక కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వల్ల 10వేల జలజాతులు 170 రకాల పక్షులు మరణిస్తున్నాయి. పక్షులు తమ గూడు కట్టుకోవడానికి ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం వల్ల వాటి జీవిత కాలం సగానికి తగ్గిపోతుంది. * అల్యూమినియం డబ్బాలు 80 నుంచి 100 ఏళ్లు భూమిలో కరుగటానికి పట్టేకాలం * పాలిథిన్ కవర్లు 1000 సంవత్సరాలు * సిగరేట్ పీక 1 నుంచి 12 ఏళ్లు * నైలాన్ దుస్తులు 30 నుంచి 40 ఏళ్లు * లెదర్ షూ 25 నుంచి 40 ఏళ్లు * కాయగూరలు 5 నుంచి 30 రోజలు * అరటితొక్క 24 రోజలు * చెరుకు పిప్పి 30 నుంచి 60 రోజలు
* కాగితం కవర్ 2నుంచి 5నెలలు * దూది 1నుంచి 5నెలలు .