Friday, April 26, 2024

శిక్షణపై ఆసక్తి చూపని క్రీడాకారులు

- Advertisement -
- Advertisement -

Players who are not interested in training

 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి దెబ్బకు దేశ వ్యాప్తంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్4లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. క్రీడాకారులు ఖాళీ స్టేడియాల్లో సాధన చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. అన్‌లాక్ సమయంలో భారీ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా సాంఘీక దూరం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో క్రీడాకారుల్లో మరో రకమైన ఆందోళన నెలకొంది. కరోనా భయంతో క్రీడాకారులు ఎవరూ కూడా సాధన చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆంక్షలు లేకున్నా చాలా మంది ఆటగాళ్లు ఇంటికే పరిమితమవుతున్నారు. క్రీడాకారుల అనాసక్తిని దృష్టిలో పెట్టుకుని ఆయా క్రీడా సంఘాలు కూడా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు.

స్పందించని టిటి స్టార్లు

ప్రభుత్వం ఖాళీ స్టేడియాల్లో సాధనకు అనుమతి ఇవ్వడంతో భారత టెబుల్ టెన్నిస్ సమాఖ్య క్రీడాకారులకు శిక్షణ నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు తాము ప్రారంభించే శిక్షణకు రావాలని క్రీడాకారులను కోరింది. కానీ సమాఖ్య ప్రతిపాదనకు క్రీడాకారుల నుంచి స్పందన కరువైంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాము శిక్షణకు హాజరు కాలేమని స్టార్ క్రీడాకారులు శరత్ కమల్, సత్యన్ తదితరులు స్పష్టం చేశారు. ఇతర క్రీడాకారులు కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. కాగా, లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో 16 మంది అగ్రశ్రేణి క్రీడాకారులకు జూన్ మొదటి వారంలో శిక్షణ శిబిరం నిర్వహించాలని టిటి సమాఖ్య నిర్ణయించింది. ఇందులో భాగంగా పాటియాలా, ఢిల్లీలోని ఏదో ఒక శిక్షణ కేంద్రానికి రావాలని క్రీడాకారులను కోరింది. కానీ, ఆటగాళ్ల నుంచి సానుకూల స్పందన రాలేదు. ప్రస్తుతం ప్రయాణాలపై పలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో తాము శిక్షణకు రాలేమని, జులై మొదటి వారంలో దీన్ని ప్రారంభించాలని కోరారు. దీంతో టిటి సమాఖ్యకు ఏం చేయోలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News