Thursday, March 28, 2024

ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 22, ఆదివారం(రేపు) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలందూ ఎవరికి వారే స్వచ్ఛందంగా నిర్భందం విధించుకొని కరోనాపై పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ట్వీట్టర్ ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ పై చేసే పోరాటంలో ప్రజలందరూ.. సామాజిక దూరం, వ్యక్తిగత నిర్భందం, వ్యక్తిగత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హాంకాంగ్‌, సింగపూర్‌, జపాన్‌ దేశాలు ప్రమత్తమై కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుండగా.. ఇటలీ, యూఎస్‌ వంటి ఇతర దేశాలు నిర్లక్ష్యంతో ఏ విధంగా అల్లాడిపోతున్నాయో చూస్తున్నామన్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ దయచేసి ప్రభుత్వం సూచనలు పాటించి సురక్షితంగా ఉండాలని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటి వరకూ దేశంలో మొత్తం 275, తెలంగాణలో 19 పాజిటీవ్ కరోనా కేసులు నమోదయ్యాయి.

Please Follow govt guidelines and stay safe: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News