Home పెద్దపల్లి ‘పేపర్’ బ్యాగులే ముద్దు!

‘పేపర్’ బ్యాగులే ముద్దు!

పాలిథిన్ ర‘హితం’ దిశగా మంథని అడుగులు
నేటి నుంచి పాలిథిన్‌పై నిషేధం అమలు
ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగులు అందుబాటులోకి
పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో మహిళలకు పేపర్ బ్యాగుల శిక్షణ
పర్యావరణ పరిరక్షణకు మంథని మేజర్ గ్రామపంచాయతీ ముందడుగు

Paper-Bags1

Paper Bagsమంథని: పర్యావరణ పరిరక్షణకు మంథని మేజర్ గ్రామ పంచాయతీ ముందడుగు వేసింది. పాలిథిన్ వాడటంవల్ల ఎన్నో మనకు తెలియని అనర్థాలు, వాటి వల్ల కలిగే అనారోగ్యాల నుంచి ప్రజలను రక్షించి పర్యావరణాన్ని కాపాడేందుకు పాలిథిన్‌ను నిషేధిస్తూ ఇప్పటికే మంథని గ్రామపంచాయతీ సర్పంచ్ పుట్ట శైలజ అధ్యక్షతన పాలకవర్గం తీర్మానం చేయగా, (కొత్త సంవత్సరం, జనవరి 1, 2017) నేటి నుంచి పాలిథిన్ వాడకం నిషేధాన్ని మంథని గ్రామపంచాయతీ పరిధిలో అమలు చేయనున్నారు. పాలిథిన్ కవర్లు, బ్యాగులను నిషేధించడంలో ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు, అసౌకర్యాలు కలుగకుండా ఇప్పటికే మంథని పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పేపర్ బ్యాగుల తయారీకి శిక్షణ ఇస్తూ ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

పాలిథిన్ రహితమంటే పెద్దపల్లి జిల్లానే గుర్తుకు రావాలని జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణీని ఇచ్చిన పిలుపు మేరకు మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధు, సర్పంచ్ పుట్ట శైలజ నేతృత్వంలోని పుట్ట లింగమ్మ ఛారీటబుల్ ట్రస్టు చైర్మన్ బిట్టు శ్రీను ముందడుగు వేయగా, మంథని గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్సు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ డిసెంబర్ 2న కలెక్టర్ వర్షిణీ, ఎంఎల్‌ఎ పుట్ట మధుల చేతుల మీదుగా పేపర్ బ్యాగుల తయారీ ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు సుమారు 150 మంది మహిళలకు శిక్షణను అందిస్తున్నారు.

పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత: మంథని సర్పంచ్ పుట్ట శైలజ
నేటి ఆధునిక యుగంలో రోజురోజుకు పర్యావరణ, వాతావరణం పెరిగిపోతున్నది. దీంతో ప్రజలు అనేక రోగాల భారీన పడటంతో పాటు ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి, పేపర్ బ్యాగుల వాడకాన్ని చేపట్టడం వల్ల కోంత మేర పర్యావరణాన్ని కాపాడిన వాళ్లం అవుతాం. పర్యావరణ పరిరక్షణ అన్నది ఒక్కరి బాధ్యత కాదు.. మనందరి బాధ్యత అని ప్రజలు గుర్తుంచుకోని నడుచుకోవాలి. పాలిథీన్ కవర్ల స్థానంలో మహిళలు తయారుచేసిన పేపర్ బ్యాగులను ప్రజలు, వ్యాపారులు వినియోగించుకోవాలి.

ఇటు ఉపాధి.. అటు ఆరోగ్యం
ట్రస్టు చైర్మన్ బిట్టు శ్రీను
పేపర్ బ్యాగులను తయారీ చేయడం వల్ల ఇటూ మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు వాటిని వాడే ప్రజానీకానికి ఆరోగ్య కారమైన వాతావరణాన్ని అందించిన వాళ్లమవుతాం. తమ పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు పేపర్ బ్యాగుల తయారీకి పెద్ద ఎత్తున ఉచితంగా శిక్షణను అందించి వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం సామాజిక బాధ్యతగా తమ ట్రస్టు ముందుకు సాగుతుందని తెలిపారు.