Friday, March 29, 2024

రేపిస్టులకు నపుంసకత్వమే తగిన శిక్ష: పాక్ ప్రధాని

- Advertisement -
- Advertisement -

PM Imran Khan Suggests Chemical Castration for rapists

ఇస్లామాబాద్ : రేపిస్టులకు నపుంసకత్వమే సరైన శిక్ష అని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. ఈ నెల 11న లాహోర్ సమీపంలోని ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న ఓ మహిళపై జరిగిన అత్యాచారం ఘటనపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరోసారి అలాంటి ఘాతుకానికి అవకాశం లేకుండా చేయాలన్నదే తన అభిప్రాయమని ఖాన్ వివరించారు. అలాంటి వారిని బహిరంగంగా ఉరి తీయాలని తాను కోరుకుంటానని, అయితే అధికారులు తనకు ఇచ్చిన సూచన మేరకు ఆ ఆలోచన విరమించుకున్నానని ఖాన్ తెలిపారు.

అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో ప్రాధాన్యతా హోదాకు విఘాతం కలుగుతుందన్నది అధికారుల సూచన. యూరోపియన్ యూనియన్ నుంచి 2014లో జిఎస్‌పి ప్లస్ హోదా పాకిస్థాన్‌కు లభించింది. లాహోర్ ఘటనలో ఓ నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు పాక్ పోలీసులు తెలిపారు. నిందితుడి డిఎన్‌ఎ, ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో సరిపోయిందని అధికారులు తెలిపారు. మరో నిందితుడి కోసం జిపిఎస్ డేటా ఆధారంగా గాలిస్తున్నారు. లాహోర్ ఘటన పట్ల పాకిస్థాన్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.

PM Imran Khan Suggests Chemical Castration for rapists

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News