Home జాతీయ వార్తలు కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని

కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని

modi

 భారత్ నుంచి బయలుదేరిన మొదటి జట్టు 500 మంది
మొదటి జట్టులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ సిఎం ప్రకాష్‌సింగ్ బాదల్, సిఎం అమరీందర్
ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించిన ప్రధాని మోడీ

డేరాబాబా నానక్ : కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. దాని మీదుగా ప్రయాణించే దాదాపు 500 మంది మొదటి జట్టు భారత యాత్రికులకు జెండా ఊపి సాగనంపారు. బయలుదేరిన ఈ యాత్రికుల్లో మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, మాజీ సిఎం ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబందక్ కమిటీ సభ్యు లు, పంజాబ్‌కు చెందిన 117 మంది ఎంఎల్‌ఎలు, ఎంపిలు ఉన్నారు. ఈ కారిడార్ పాక్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను కలుపుతుంది. ఇక్కడ నుంచి బయలు దేరిన యాత్రికులకు అకల్ తఖత్ జతేదర్ గ్యానీ హర్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించారు. ప్రధాని భారత్ భూభాగం వైపు ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. దీన్ని సమగ్ర చెక్‌పోస్టు అని అంటారు. 4.5 కిమీ పొడవున్న ఈ కొత్త రారిడార్‌పై ప్రయాణించడానికి ఈ చెక్‌పోస్టు దగ్గరనే యాత్రికులకు క్లియరెన్సు లభిస్తుంది. ప్రధాని మోడీ గవర్నర్ విపి సింగ్ బద్నోర్, సిఎం అమరిందర్‌తో కలిసి సామూహిక విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

PM inaugurates Kartarpur corridor