Saturday, April 20, 2024

మన వస్తువులనే ఆదరిద్దాం

- Advertisement -
- Advertisement -

ప్రపంచం ఆదరించేలా చేద్దాం
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధిద్దాం

అందరికీ కరోనా టీకా, వెయ్యి రోజుల్లో గ్రామాలకు ఆఫ్టికల్ ఫైబర్‌తో అనుసంధానం
ప్రతి ఒక్కరికీ  హెల్త్‌కార్డు, వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ దాకా అన్ని రంగాల్లో సంస్కరణలు,
ఎల్‌ఎసి నుంచి ఎల్‌ఒసి వరకు ప్రపంచం మన పరాక్రమాన్ని చూసింది
భారత్‌పై కన్నేస్తే తగిన  బుద్ధిచెబుతారని మన సైనికులు చాటి చెప్పారు                                                రూపాయికే ఆడపిల్లలకు శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నాం
పంద్రాగస్టు వేడుకలో జెండావిష్కరణ
అనంతరం ఎర్రకోట మీదుగా ప్రధాని మోడీ ప్రసంగం

PM Modi 74th I-Day Address from Red Fort

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపైనుంచి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ తాను గతంలో ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాధించడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించిన ప్రధాని కేంద్రం చేపట్టిన పథకాలు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన సంస్కరణలను దేశ ప్రజలకు వివరించారు. దేశ సరిహద్దులు సహా అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులు, పోలీసులకు ప్రధాని ప్రణామం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. ఆరు లక్షల గ్రామాలను వెయ్యి రోజుల్లోగా ఆప్టికల్ ఫైబర్‌లో అనుసంధానం చేసాంతమని తెలిపారు.

వోకల్ ఫర్ లోకల్

75ఏళ్ల తర్వాత కూడా భారత్ స్వయం సమృద్ధి సాధించడంలో వెనకబడింది. ఈ నిమిషం నుంచే గట్టి సంకల్పంతో ముందుకు వెళదాం. దేశ యువత ఆత్మ నిర్భర్ భారత్ సాధించాలి. అది కేవలం నినాదం కాకూ డదు.. సంకల్పం కావాలి. మన వస్తువులను మనమే గౌరవించుకోకపోతే ఇంక ప్రపంచం ఎలా గౌరవిస్తుంది. పూర్వం భారతీయ వస్తువులంటే విశ్వమంతటా గౌరవం ఉండేది. మళ్లీ పూర్వవైభవం తెచ్చుకుందాం. భారత్ తయారీ వస్తువులు ప్రపంచం ఆదరించేలా చేద్దాం. పిపిఇ కిట్లు, ఎన్95 మాస్కులతో అది నిరూపితమైంది. మనం ఇప్పుడు వాటిని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయగలుతున్నాం. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మాటకు కట్టుబడుతాం.. యువతకు కొత్త అవకాశాలు కల్పిద్దాం.

టీకాకు రోడ్‌మ్యాప్

కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో మూడు వ్యాక్సిన్లు పరీ క్షల దశలో ఉన్నాయి. శాస్త్రవే త్తలు ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తే అప్పుడు వాటిని దేశంలోని ప్రతి పౌరుడికి చేరవేసేందుకు ప్రణా ళికలు రచిస్తున్నాం. అందు కోసం ఒక రోడ్‌మ్యాప్ తయారు చేశాం. దానికి కావాల్సిన మౌలి క సదుపాయాలు కూడా సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరికి తప్పకుండా టీకా అందిస్తాం.

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపైనుంచి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ తాను గతంలో ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాధించడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించిన ప్రధాని కేంద్రం చేపట్టిన పథకాలు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన సంస్కరణలను దేశ ప్రజలకు వివరించారు. దాదాపు 86 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించిన మోడీ ప్రసంగం ప్రారంభంలో దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సరిహద్దులు సహా అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులు, పోలీసులకు ప్రధాని ప్రణామం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. దేశాన్ని కరోనాతో పాటుగా వరదలు, ప్రకృతి విపత్తులు చుట్టుముట్టాయన్నారు. ప్రధాని తన ప్రసంగంలో పలు పథకాలనుకూడా ప్రకటించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన మోడీ ఈ పథకం కింద ప్రతి ఒక్కరికీ ఆరోగ్య గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. అలాగే దేశంలోని మొత్తం ఆరు లక్షల గ్రామాలను వెయ్యి రోజుల్లోగా ఆప్టికల్ ఫైబర్‌లో అనుసంధానం చేసాంతమని తెలిపారు. నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత జమ్మూ, కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిపిస్తామని కూడా హామీ ఇచ్చారు.

స్వాతంత్య్ర సంగ్రామం ప్రేరణతో దేశం ముందుకు సాగుతోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైంది. కరోనా విపత్కర పరిస్థితిలోను దేశం ఒక్కటై నిలిచింది. 25 ఏళ్లు వచ్చిన ప్రతి బిడ్డ సొంత కాళ్లపై నిలబడాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్ స్వయంసమృద్ధి సాధించలేకపోయింది. ఈ క్షణంనుంచి స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకు సాగాలి. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం. ఏ ఒక్కరూ ఏకాకిగా మనలేరు. భారత్ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం. ప్రపంచ కళ్యాణానికి మనవంతు కూడా నిరంతరం చేస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం నినాదం కాదు. ఆత్మనిర్భర్ భారత్ కోసం మనందరి సంకల్పం కావాలి. దేశ యువత ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు.
వోకల్ ఫర్ లోకల్
‘భారత్ తయారీ వస్తువును ప్రపంచమంతా ఆదరించేలా తయారు చేస్తాం. ఒకనాడు భారత వస్తువులంటే ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తీసుకు రావాలి. భారత్ అంటే నాణ్యమైన వస్తువులకు అడ్డా అనే గౌరవాన్ని తెచ్చుకుందాం. మన వస్తువులను మనమే గౌరవించుకోకపోతే ప్రపంచం ఎలా గౌరవిస్తుంది. పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు కూడా వెతుక్కునే పరిస్థితి ఉండేది. నాలగు నెలల్లో స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.‘ వోకల్ ఫర్ లోకల్’ అనే మాటను నిలబెట్టుకుందాం’ అని అన్నారు.

పాక్, చైనాలకు పరోక్ష హెచ్చరిక
ప్రధాని తన ప్రసంగంలో సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్, చైనాలకు పరోక్షంగా తీవ్ర హెచ్చరిక చేశారు. ఎల్‌ఓసి(నియంత్రణ రేఖ)నుంచి ఎల్‌ఎసి(వాస్తవాధీన రేఖ) వరకు మన దేశ సార్వభౌమాధికారంపై ఎవరు కన్నేసినా వారందరికి మన జవానులు వారి భాషలోనే తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రధాని తన ప్రసంగంలో పాక్, చైనా పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆ రెండు దేశాల గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది సుస్పష్టం. లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇటీవల జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ, భారత దేశ సార్వభౌమాధికారాన్నిపరిరక్షించుకోవడం మనకు అన్నిటికన్నా ముఖ్యమని, దీన్ని కాపాడడానికి మనవీర జవాన్లు లడఖ్‌లో ఏం చేశారో ప్రపంచమంతా చూసిందని అన్నారు.‘ఆ వీర జవాన్లకు ఎర్రకోటపైనుంచి సెల్యూట్ చేస్తున్నాను’ అని ప్రధాని అన్నారు.

కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రధాని తన ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి మూడు వ్యాక్సిన్లు వివిధ దశల పరీక్షల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తల ఆమోదం, అనుమతి లభించిన వెంటనే ప్రతి భారతీయుడికి లభించే విధంగా ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికతో ఉన్నామని, దీనికి సంబంధించి రోడ్‌మ్యాప్ కూడా సిద్ధంగా ఉందని ప్రధాని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వారియర్స్‌కు శిరసు వంచి సలాం చేస్తునానంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని దేశ ప్రజలకు ఈ శుభవార్త అందించారు. దేశానికి సేవ చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సులు, ఇతర కరోనా వారియర్స్‌కు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంక్షోభం కారణంగా తాను ఈ ఏడాది పిల్లలను ఎర్రకోట వద్ద చూడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి చాలా కుటుంబాలు ప్రభావితమైనాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 130 కోట్ల భారతీయుల సంకల్ప బలంతో ఈ మహమ్మారిని ఓడించి తీరుతామని ప్రధాని అన్నారు. అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేలా ఒక యూనిక్ ఐడిని తీసుకు వస్తున్నామన్నారు. ‘వన్ నేషన్ వన్ హెల్త్‌కార్డ్’ పథకంలో భాగంగా ఆధార్ కార్డు తరహాలో హెల్త్‌కార్డు జారీ చేయనున్నామని తెలిపారు. దశలవారీగా అమలు చేయనున్న ఈ పథకానికి 300 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కూడా ప్రధాని చెప్పారు.

గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్

దేశంలోని ఆరు లక్షలకు పైగా ఉన్న అన్ని గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే ప్రాజెక్టును రాబోయే వెయ్యి రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని మోడీ చెప్పారు.ఈ సమయంలోనే లక్షద్వీప్‌ను కూడా సముద్రం లోపల ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో అనుసంధానం చేస్తామని తెలిపారు.
అన్ని రంగాల్లో సంస్కరణలు
వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ దాకా అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించామని ప్రధాని తెలిపారు. ఎఫ్‌డిఐల విషయంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని గత ఏడాది 18 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. ప్రపంచం మన దేశంపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. అనేక సంకటాలు ఎదుర్కొన్న దేశం ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళుతోందని చెప్పారు. కష్టకాలంలో ప్రతి ఇంటికి ఆహార ధాన్యాలు చేరాయి. ఉచిత గ్యాస్, ఆహార ధాన్యాల పంపిణీ 80 కోట్ల మందిని ఆకలినుంచి దూరం చేశాయన్నారు. అలాగే రైతుల తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన తాగునీటితో సగం ఆరోగ్య సమస్యలకు సమాధానం చెప్పవచ్చని అంటూ, జాతీయ జల్‌జీవన్ మిషన్‌తోఆరోగ్య రంగంలో గొప్ప మార్పు వస్తుందని వివరించారు.

ప్రతిఏటా ఓ ప్రత్యేక రంగులో తలపాగా!

స్వాతంత్య్ర వేడుకల్లో తలపాగా ధరించే సంప్రదాయాన్ని ప్రధాని మోడీ కొనసాగిస్తున్నారు. ఏడోసారి ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రధాని కాషాయం క్రీమ్ కలర్ తలపాగాతో కనిపించారు. హాఫ్‌స్లీవ్ కుర్తా, చురీదార్ ధరించి కాషాయం అంచులతో కూడిన తెల్లని కండువాను భుజాలపై వేసుకున్నారు. కోవిడ్ నిబంధనలకనుగుణంగా దానినే ఆయన మాస్క్‌గా ముక్కుకూ, నోటికీ కప్పుతూ కనిపించారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతేడాది నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పలు రంగుల తలపాగాను ధరించారు. మొదటిసారి ప్రధానిగా 2014 వేడుకల్లో జోధ్‌పురి సంప్రదాయిక తలపాగా ధరించారు. 2015లో పసుపు రంగు తలపాగా, 2016లో పింక్, పసుపు రంగుల తలపాగా, 2017లో ముదురు ఎరుపు, పసుపు రంగుల తలపాగా, 2018లో కాషాయం తలపాగా ప్రధాని మోడీ ధరించారు. స్వాతంత్య్ర వేడుకలతోపాటు,రిపబ్లిక్ వేడుకల్లోనూ ప్రధాని ధరించే తలపాగాలు ఏదో ఒక ప్రత్యేకతతో అందరినీ ఆకర్షిస్తాయి.

కట్టుదిట్టమైన భద్రత
ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర వేడుకలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 4000మంది భద్రతా సిబ్బందితో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జి, ఎస్‌పిజి, ఐటిబిపి దళాలతోపాటు స్వాత్ కమెండోలను ఎర్రకోట చుట్టూ మోహరించారు. 3000కుపైగా సిసి కెమెరాలతో ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి భారత్‌లో తయారైన యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను కూడా ప్రధాని రక్షణకు ఏర్పాటు చేశారు. ఇది వేదిక సమీపంలోని ఆకాశం మొత్తాన్ని స్కాన్ చేసి ఇతర డ్రోన్ల జాడను కనిపెడ్తుంది. డిఆర్‌డిఒ దీనిని తయారు చేసింది. దీనిలో ఏర్పాటు చేసిన లేజర్ సాంకేతికత ఎర్రకోట సమీపంలోని మూడు కిలోమీటర్ల పరిధిలోని మైక్రోడ్రోన్లను గుర్తించి కదలకుండా చేస్తుంది.

PM Modi 74th I-Day Address from Red Fort

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News