Saturday, April 20, 2024

ప్రధానిగా కాదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా: ప్రధాని

- Advertisement -
- Advertisement -

PM Modi address at Army Camp in Nowshera

శ్రీనగర్‌: సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని, ప్రతికూల పరిస్థితుల్లోనూ సైనికులు దేశానికి రక్షణగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో గురువారం దేశ సైనికులతో కలిసి ప్రధాని మోడీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశానికి సైన్యం సురక్షా కవచమని, సైనికుల కోసం 130కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకువచ్చానని అన్నారు. తాను ప్రధానిగా రాలేదని, మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చానన్నారు. ప్రతి దీపావళి సైనికులతోనే జరుపుకుంటున్నానని, జవాన్ల మధ్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సైన్యం ధైర్యసాహసాలు దీపావళికి మరింత శోభను తీసుకువచ్చాయని కొనియాడారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమన్నారు. సైన్యానికి తేజస్‌, అర్జునలాంటి అత్యాధునిక ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. 200కిపైగా అత్యాధునిక ఆయుధాలు స్వయంగా తయారు చేసుకుంటున్నామని, ఆయుధ సంపత్తితో సైనిక శక్తి నిరంతరం బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

PM Modi address at Army Camp in Nowshera

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News