Thursday, April 25, 2024

మనం ఓటమిని ఒప్పుకోవద్దు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi Addresses Indian Chamber of Commerce

న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవం నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ… ”ఇది పరీక్షా కాలం. మనం ఓటమిని ఒప్పుకోవద్దు.. నిరంతరం గెలుపుకోసం ప్రయత్నించాలి. ఛాలెంజ్ లను ఎదుర్కొన్నవారే విజేతలవుతారు. ఐకమత్యమే మన బలం. సమస్యలు వచ్చినపుుడు భయపడితే ముందుకెళ్లలేము. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకెళ్లాల్సిందే. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కోంటుంది. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లడమే మన కర్తవ్యం. భవిష్యత్తును నిర్ణయించేది మన శక్తి సామర్థ్యాలే” అని ప్రధాని పేర్కొన్నారు.

”ప్రపంచమంతా కోవిడ్ పై పోరాడుతోంది. దేశం తన కాళ్లపై తాను నిలబడాలి. అందుకే మనం ఆత్మ నిర్భర్ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. విదేశాలపై ఆధారపడటం తగ్గించుకునేందుకే ఆత్మ నిర్భర్ భారత్. స్వదేశీ నినాదం ఊపందుకోవాలి. ఎన్నో దేశాలకు మనం ఎగుమతులు చేస్తున్నాం. భారత్ పురోగతిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాత్ర గొప్పది. సవాళ్లను ఎదుర్కొవడంతో పరస్పర సహకారం అవసరం. దేశంలో కరోనాతో పాటు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంతో గట్టి పోరాటం సాగుతోంది. ఆత్మస్థైర్యంతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. మన శక్తి సామర్థాలను ప్రదర్శించే సమయమిది. రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రారంభించాం. ఈశాన్య భారత్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ కు ఐసిసి సాయం చేయాలి” అని ప్రధాని మోడీ తెలిపారు.

PM Modi Addresses Indian Chamber of Commerce

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News