Friday, March 29, 2024

మెడికల్ హబ్‌గా యుపి..

- Advertisement -
- Advertisement -

సిద్ధార్థనగర్(యుపి): ఉత్తర్ ప్రదేశ్‌లో తొమ్మది వైద్య కళాశాలలను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. పేదలకు మౌలిక సౌకర్యాలు కల్పించడమే బిజెపి ప్రాధాన్యతని ప్రధాని తెలిపారు. ఇక్కడ నుంచి వర్చువల్ పద్ధతిలో వైద్య కళాశాలలను ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన పేదల ప్రజలకు వైద్య అవసరాలను సమకూర్చడంలో గత ప్రభుత్వం విస్మరించిందని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఇదివరకటి సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. కుటుంబ ఖజానాను నింపుకోవడం తప్ప అప్పటి పాలకులు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. బిజెపి పాలనలో యుపి మెడికల్ హబ్‌గా ఇప్పుడు మారుతోందని ఆయన తెలిపారు.

2017లో బిజెపి అధికారంలోకి రావడానికి రాష్ట్రాన్ని పాలించిన ఎస్‌పి ప్రభుత్వంపై పరోక్షంగా తన దాడిని కొనసాగిస్తూ వారి అవినీతి 24 గంటలూ కొనసాగేదని ఆరోపించారు. మందులు, నియామకాలు, బదిలీలు, పోస్టింగులు వంటి అన్ని విషయాల్లో ఆ పరివారానికి చెందిన(అఖిలేష్ యాదవ్ కుటుంబం) వారే అవినీతికి పాల్పడేవారని, వీరి అవినీతి చక్రాల కింద పూర్వాంచల్, యుపిలోని పేద ప్రజలు చితికిపోయారని ప్రధాని విమర్శించారు.

PM Modi Begins 9 Medical Colleges in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News