Monday, November 4, 2024

‘ప్రారంభ్‌’లో యువత పాల్గొనాలి: ప్రధాని మోడీ పిలుపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ నెల 15, 16 తేదీలలో జరిగే స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సదస్సు ‘ప్రారంభ్‌’లో పాల్గొనవలసిందిగా యువజనులకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పిలుపునిచ్చారు. పరిశ్రమ, విద్యారంగం, పెట్టుబడులు, బ్యాంకింగ్, ఆర్థిక రంగానికి చెందిన నిపుణులతోపాటు యువ అంకుర నాయకులను ఒక చోటకు చేర్చడమే ఈ సదస్సు లక్షమని ప్రధాని తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి కాలంలో వీడియో సమావేశాల ద్వారా కార్యక్రమాలు జరగడం ఇప్పుడు సర్వసాధారణ మైపోయిందని, ఇంట్లో కూర్చునే ప్రజలు కార్యక్రమాలలో పాల్గొనడం గొప్ప అవకాశమని మోడీ ట్వీట్ చేశారు. అత్యధిక కార్యక్రమాలు వర్చువల్‌గా జరగడం వల్ల దేశీయ, అంతర్జాతీయ సమావేశాలలో యువజనులు పాల్గొనే అవకాశాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15, 16 తేదీలలో జరిగే ప్రారంభ్‌సదస్సు అటువంటి మరో గొప్ప అవకాశమని, దీన్ని యువజనులు సద్వినియోగం చేసుకోవాలని మోడీ కోరారు.
2020 సంవత్సరంలో అత్యధిక కాలం ఇంటిపట్టునే గడపవలసి రావడం వల్ల ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకోక తప్పలేదని, అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ప్రధాని తెలిపారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడాన్ని గొప్ప అవకాశంగా పరిగణించాలని ఆయన అన్నారు. తన వరకు తాను ఆన్‌లైన్‌లో పాల్గొంటున్న చాలా కార్యక్రమాలతో ఎంతో నేర్చుకో గలుగుతున్నానని ఆయన చెప్పారు. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, కొవిడ్ వారియర్స్, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక నాయకులు, మరెందరితోనే తాను సమావేశమయ్యానని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ నాయకులతో ద్వైపాక్షికంగానేగాక బహుళపక్షంగా అనేకమందితో వర్చువల్ సమావేశాలు జరిపానని ఆయన చెప్పారు. డిజిటల్ ద్వారా అనేక బహిరంగ సభలలో పాల్గొని అనేక వినూత్న అభివృద్ధి పథకాలను ప్రారంభించానని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పథకాల ద్వారా లభ్ధిపొందుతున్న లక్షలాదిమంది ప్రజలతో తాను ముచ్చటించానని ఆయన చెప్పారు.

PM Modi Calls to Youngsters to join Start Up India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News