Home జాతీయ వార్తలు సవాళ్లకు సృజనతో పరిష్కారం

సవాళ్లకు సృజనతో పరిష్కారం

Pm Modi

థింపూ : ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఇప్పటి యువతకు అద్భుత అవకాశాలు ఉన్నాయని, ఇప్పటి ప్రపంచం అపూర్వ స్థాయిలో యువతకు అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని ప్రఖ్యాత రాయల్ యూనివర్శిటీ ఆఫ్ భూటాన్ విద్యార్థులతో ఆదివారం ఇష్టాగోష్టి జరిపారు. ఇప్పటి యువతరం అన్ని విధాలుగా లక్కీ అన్నా రు. ఈ సందర్భంగా భూటాన్ యువతను ప్రశంసించా రు. భూటానీ యువత ఏదైనా సాధించగలదని, వారికి ఆ అసాధారణ ప్రతిభ ఉందని, వీరి శక్తి సామర్థాలు భావితరాలను ప్రభావితం చేయగలవని తెలిపారు. ఈ హిమాలయ సానువుల దేశాన్ని అత్యున్నత శిఖర స్థాయి కి తీసుకువెళ్లేందుకు యువత ముందుకురావాలని మోడీ పిలుపు నిచ్చారు. ప్రతిభావంతులైన యువత కష్టపడాలి. వారి ప్రతిభ సద్వినియోగం అయ్యేలా చేసుకోవాలని సూచించారు. ఇప్పటి యువతరానికి ప్రపంచ వేదికపై పలు అవకాశాలు రమ్మని పిలస్తుంటాయి. ఇంతకు ముందెన్నడూ ఈ పరిస్థితి లేదని మోడీ తెలిపారు. యువ త ఎటువంటి సవాళ్లను అయినా ఎదుర్కొగలదు. ప్రపంచ గమనంలో పలు సవాళ్లు ఉండనే ఉన్నాయని, సమస్యలకు పరిష్కారం, వాటిని అధిగమించే శక్తి యువతకు ఉందని మోడీ తెలిపారు.
జటిల సమస్యలకు సృజనాత్మ క పరిష్కార మార్గాలను యువ మేథస్సు ఆవిష్కరించగలదన్నారు. భూటాన్ యువతరం తమ నిగూఢ శక్తిని తెలుసుకుని, పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిదం టూ ఏదీ లేదని చెప్పారు. భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ సమక్షంలో ప్రధాని మోడీ విద్యార్థులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వారిని కొన్ని ప్రశ్నలు వేశారు. భూటాన్ పట్ల భారతదేశానికి ప్రత్యేక అభిమానం ఉందని, ఈ దేశం లక్ష సాధనతో ముందు కు వెళ్లితే 130 కోట్త భారతదేఠం మురిసిపోతుంది. అంతేకాకుండా ఇక్కడి యువతకు అవకాశాలను కల్పిస్తుంది. సమాచార విజ్ఞాన పరస్పర వినిమయంతో ఉంటుందని తెలిపారు.
మా పరిణామంతో మీకు సహకారం
భారతదేశం అన్ని రంగాలలో ఇప్పుడు గణనీయ పరిణాత్మక దశలో ఉందని ప్రధాని మోడీ తెలిపారు. స్కూళ్ల నుంచి స్పేస్ వరకూ వివిధ రంగాలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇది చారిత్రక పరిణామం. దీని ఫలితాలను భూటాన్‌తో పంచుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని, దీనిని ఇక్కడి యువత గమనించాలని, అంది వచ్చే అవకాశాలన్నీ కూడా ఇప్పటి ప్రపంచంలో ముందుగా యువత వద్దకే వచ్చి వాలుతాయని, అయితే వాటిని ఒడిసిపట్టుకోవడమే యువత ప్రతిభకు తార్కా ణం అవుతుందన్నారు. భారతదేశం డిజిటల్ చెల్లింపుల నుంచి విపత్తు నిర్వహణల వరకూ పురోగతి దిశలో ఉందన్నారు. పలు రంగాలలో భారతదేశం నుంచి అందే సహకారం నేరుగా ఇక్కడి యువ స్నేహితులకు చెందుతుందని, ఈ అవకాశాన్ని భూటాన్ యువత అందుకోవ ల్సి ఉందన్నారు.
ఇప్పటికే తమ నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ కు భూటాన్ డ్రక్‌రెన్‌కు మధ్య ఉన్న సహకారం వివిధ సహకార ప్రక్రియలకు ఓ ఉదాహరణ అన్నారు. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్‌ను చేపట్టిందని, భూటాన్ కూడా సొంత ఉపగ్రహాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. ఇక్కడి యువ శాస్త్రజ్ఞులు సొంత శాటిలైట్ రూపకల్పన కోసం ఇండియాకు వస్తున్నారని, ఇది భారతదేశానికి చాలా సంతోషకరమని, త్వరలోనే పలువురు భూటానీ యువకులు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లుగా, సృజనాత్మకులుగా మారుతారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి జల విద్యుత్ ఉత్పాదనలో భారతదేశ సహకారం ఇరుదేశాల మధ్య సహకారానికి తార్కాణం అన్నారు. భౌగోళిక, చారిత్రక సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుబంధాలు అన్నీ కూడా ఇరుదేశాలనూ విశిష్ట రీతిలో కలిపాయని ప్రధాని చెప్పారు. తాను రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంలోని పలు అంశాలకు బుద్ధ భగవానుడి బోధనలే స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. అధ్యయనం, విద్యా విజ్ఞానలుల శతాబ్దాలుగా ఇరుదేశాల సబంధాలకు కేంద్రబిందువు లు అయ్యాయని అన్నారు. నలందా విశ్వవిద్యాలయం వంటి పలు విద్యాసంస్థలలో విద్యాభ్యాసానికి ఇక్కడి యువతను ఆహ్వానిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. ప్రధా ని మోడీ భూటాన్‌లో రెండు రోజుల పర్యటనకు శనివారం వచ్చారు.
సంతోషపు విలువ తెలిసిన దేశమిది
భూటాన్‌కు సంతోషపు విలువ తెలుసునని, మానవాళికి భూటాన్ ఇచ్చిన సందేశం ఆనందంగా ఉండటం అని ప్రధాని కొనియాడారు. స్థూల జాతీయ సంతోషంలో భూటాన్ అన్ని దేశాల కన్నా ముందుందని అన్నారు. హ్యాపీతో దేశం ఏదైనా సాధించవచ్చునని ఈ దిశలో భూటాన్ ప్రపంచానికి ఇచ్చే పిలుపును అంతా అందుకుంటే మంచిదని తెలిపారు. విద్యార్థులతో ముచ్చట్ల దశలో వారి సంతోషం గురించి మోడీ ఆరాతీశారు. అభివృద్ధి, పర్యావరణం, సంస్కృతి ఆచార వ్యవహారాలు అన్ని కూడా ఒక సవ్యమైన రీతిలో సమన్వయంతో సాగ డం భూటాన్‌లో ఉందని, అందుకే ఈ దేశం సంతోషపు దేశంగా నిలిచిందని ప్రధాని కితాబు ఇచ్చారు.
ప్రధాని మోడీ స్వదేశీ పయనం
భూటాన్‌లో పర్యటన తరువాత ప్రధాని మోడీ ఆదివారం తిరిగి స్వదేశానికి బయలుదేరారు. భూటాన్‌కు ధన్యవాదాలు. ఇది తనకు చిరస్మరణీయ పర్యటనగా ఉందని, భూటానీల నుంచి తనకు అందిన ఆత్మీయతాపూర్వక ఆదరణ కదలించివేసిందని, ఇది తనకు కలకాలం గుర్తుంటుందని తిరుగు ప్రయాణ దశలో మోడీ ట్వీటు వెలువరించారు. ఈ పర్యటనతో భూటాన్ భారత్‌ల సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల నేతల మధ్య పది ఎంఒయులపై సంతకాలు జరిగాయి. పరిశోధనా, వైమానిక ఇంధన, విద్యారంగం, అంతరిక్షం వంటి వాటిలో కీలక సహకారానికి ఇవి దోహదం చేస్తాయని ప్రధాని తెలిపారు.

Pm Modi Chit Chat With Bhutan University Students