న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రచార బలం పెరిగింది. ఇన్స్టాగ్రామ్లో మోడీని అనుసరించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మోడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోయర్స్ సంఖ్య ఇప్పుడు 3 కోట్లకు చేరుకుంది. ప్రపంచ స్థాయి నేతలు ట్రంప్, ఒబామాలకున్న ఇన్స్టా ఫాలోయర్స్ సంఖ్య కన్నా ఇది చాలా ఎక్కువగా నమోదైంది. ప్రధాని మోడీని ఇన్స్టాగ్రామ్లో అత్యధిక సంఖ్యలో అనుసరిస్తున్నారు. ఈ విషయంలో ఆయన అమెరికా అధ్యక్షులు ట్రంప్, అంతకు ముందటి అధ్యక్షులు ఒబామాను దాటిపొయ్యారని, యువతనే ఎక్కువగా అభిమానించే ఇన్స్టాగ్రామ్లో మోడీదే పై చేయి కావడంతో ఇప్పుడు మోడీకి యువజనులలో ఉన్న ఆదరణ అభిమానం అంతకుమించిన సన్నిహితత్వం అనుసంధానం వెల్లడవుతోందని బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఓ ట్వీట్లో తెలిపారు.
PM Modi crosses 30 million followers on Instagram