Friday, April 19, 2024

నకిలీ సమాజ్‌వాదీలను అధికారంలోకి రానివొద్దు: మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi did Virtual Jan Chaupal Rally in UP

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి) అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వ్యతిరేక వర్గాలను రంగంలోకి దించిందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆరోపించారు. ‘నకిలీ సమాజ్‌వాదీలు’ ఒకవేళ అధికారంలోకి వస్తే పేదలకు కేంద్ర ఇస్తున్న ప్రయోజనాలను పణంగా పెడతారని ఆరోపించారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ నియోజకవర్గాల వద్ద వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ, నేర చరితులను దూరంగా ఉంచాలని, దానికి బదులుగా ‘కొత్త చరిత్ర’ సృష్టించాలని ఆయన ప్రజలను కోరారు. ‘జన్ చౌపాల్’ వద్ద వర్చువల్ ర్యాలీలో ఆయన శాంతి భద్రతలు, రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై దృష్టి సారించారు. ఓటింగ్ రోజున ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని ఆయన కోరారు. భోజనానికి ముందే వచ్చి ఓటేయాలని కోరారు. ‘ముందు ఓటింగ్, తర్వాతే తినడం, త్రాగడం’(పహ్లే మత్‌దాన్, ఫిర్ జల్‌పాన్)’ అని ఆయన హిందీలో చెప్పారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 తొలి దశ ఓటింగ్ జరుగనుంది. ఘాజీయాబాద్, మీరట్, హపూర్, అలీగఢ్, నోయిడా ఓటర్లను ఉద్దేశించా ఆయన తన వర్చువల్ ర్యాలీని నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లో మోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరస్థులు, మాఫియాల విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించిందని మోడీ అన్నారు. ఒకవేళ వారికి అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ప్రజలపట్ల తప్పక ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు. ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రయోజనాలు ఉత్తరప్రదేశ్‌లో రెండింతల ప్రయోజనాన్ని కల్పించిందని ఆయన ఎత్తిచెప్పారు. ఆయన ఉద్దేశ్యంలో కేంద్రలో ఉన్నది బిజెపి ప్రభుత్వం, యూపి రాష్ట్రంలో ఉన్నదీ బిజెపి ప్రభుత్వమే కనుక రెండింతల ప్రయోజనం ఉత్తరప్రదేశ్ ప్రజలకు అందిందన్నారు.

ఐదేళ్లకు ముందు ఈ మాఫియావాదులు కేంద్రం పథకాల ప్రయోజనాలు పేదలు, దళితులు, వెనుకబడినవారికి అందకుండా చేశారన్నారు. వారు కేంద్ర పథకాలు అందకుండా, అవినీతిని నిరోధించకుండా బ్రేకులు వేశారన్నారు. “ప్రతిపక్ష పార్టీ సమాజ వ్యతిరేక శక్తులకు టిక్కెట్లు ఇస్తోంది. దాని ఆధారంగా వారి ఉద్దేశాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కనుక మీరు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేయాలని కోరుతున్నాను’ అని మోడీ కోరారు. “చలి ఎంత విపరీతంగా ఉన్నప్పటికీ బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందే వచ్చి ఓటు వేయండి. ఆ తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ చేయండి” అని మోడీ ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్లను ఉద్దేశించి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News