Home జాతీయ వార్తలు ఏం అడిగావ్ బాస్.. మోడీనే నీళ్లు నమిలేలా చేశావు…

ఏం అడిగావ్ బాస్.. మోడీనే నీళ్లు నమిలేలా చేశావు…

PM Modiన్యూఢిల్లీ: బిజెపి కార్యకర్తలతో ప్రత్యక్షంగా ముచ్చటించి పార్టీని మరింత పటిష్టం చేయడానికి మార్గ నిర్దేశం చేద్దామని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. పుదుచ్చేరికి చెందిన బిజెపి కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన ప్రత్యక్ష ముఖాముఖీ కార్యక్రమంలో ఒక కార్యకర్త వేసిన ప్రశ్నతో ఇరకాటంలో పడిన ప్రధాని అప్పటికి ఏదో సమాధానం చెప్పి తప్పించుకోగలిగినప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

పుదుచ్చేరి బిజెపి కార్యకర్తలతో ప్రధాని ముఖాముఖి సంభాషణలు జరుపుతుండగా, నిర్మల్ కుమార్ జైన్ అనే కార్యకర్త లేచి, కేంద్ర ప్రభుత్వం పన్ను వసూళ్లపైనే దృష్టి సారిస్తోంది తప్ప మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించడం లేదని అన్నాడు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మీ సమాధానం ఏమిటని అతను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అవాక్కయిన ప్రధాని వెంటనే తేరుకుని తన ప్రభుత్వం సామాన్య ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ ప్రశ్న వేసింది వ్యాపారి అయిన నిర్మల్ కుమార్ జైన్ కాబట్టి అతని నుంచి ఇటువంటి ప్రశ్న రావడం సహజమేనని ప్రధాని అన్నారు. వెంటనే ‘పురుచ్చేరి కో వణక్కం’ అంటూ ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రధాని ముగించేశారు.

కాగా, దేశవ్యాపంగా ఉన్న పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో మమేకం చెందేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమం మార్గదర్శక సూత్రాలను మార్చాలని బిజెపి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో మాట్లాడదలచని పార్టీ కార్యకర్త ఇకపై తన ప్రశ్నను వీడియోలో చిత్రీకరించి ప్రతి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందు పంపించాల్సి ఉంటుంది. ఇకపై ప్రతి కార్యకర్త గూగుల్ ఫార్మట్‌లో ఫారమ్ నింపి తన వివరాలను, తాను అడగదలచిన ప్రశ్నను ప్రధానికి పంపించాల్సి ఉంటుంది.

PM Modi faces embarassing query from BJP Worker, Puducherry BJP worker Nirmal Kumar Jain embarassed Modi with his question on Taxes on Common Man