Saturday, April 20, 2024

ఏ మూలనైనా విశిష్టతతే

- Advertisement -
- Advertisement -
PM Modi gets a warm welcome from Indians
భారతీయ సంతతికి మోడీకితాబు

వాషింగ్టన్ : భారతీయ సంతతివారు ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారి విశిష్టతను చాటుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి భారతీయులు సాదర స్వాగతం పలికారు. వారి ఉత్సాహభరిత ఆదరణాయుత స్వాగతం తనను కదిలించిందని ప్రధాని చెప్పారు. ఏ దేశము వెళ్లినా మన భారతీయ వారసత్వపు వ్యక్తులు తమ ప్రతిభాపాటవాలతో ఖ్యాతి గడిస్తున్నారని, ఇది కీలక పరిణామం అన్నారు. బుధవారం రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత ప్రధాని మోడీ ఇక్కడి విమానాశ్రయంలో దిగగానే ఇండో అమెరికన్లు భారీ సంఖ్యలో బృందాలుగా ఆయనకు అభినందనలతో కేరింతలకు దిగారు. తరువాత ప్రధాని మోడీ హోటల్‌లో భారతీయ సంతతికి చెందిన వారితో ముచ్చటించారు. మీరే దేశానికి బలం అని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో తక్కువ సంఖ్యలోనే భారతీయుల బృందం ప్రధాని మోడీతో ఇష్టాగోష్టికి వచ్చింది. అయితే అక్కడికి వచ్చిన వారు ప్రధానితో పలు విషయాలను ప్రస్తావిస్తూ ఉత్సాహంగా కన్పించారు. ఇది తనను ఆకట్టుకుందని ఆ తరువాత వారితో తాను కలిసి దిగిన ఫోటోతో కలిపి ప్రధాని ట్వీటు వెలువరించారు. అమెరికా జనాభాలో ఇండో అమెరికన్ల సంఖ్య 1.2 శాతంగా ఉంది. వీరిలో మోడీకి అత్యధిక ప్రాచుర్యం దక్కింది. ప్రధానిగా 2014లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చూస్తే ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించడం ఇది ఏడవసారి అయింది.

క్వాడ్ సదస్సు కీలకం: అమెరికాలో ప్రధాని

అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాల బృందం అయిన క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు, ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధాని మోడీ బుధవారం రాత్రి వాషింగ్టన్ డిసికి వచ్చారు. ఎయిర్‌పోర్టులో ప్రధానికి బైడెన్ అధికార యంత్రాంగంలోని సీనియర్ అధికారుల బృందం స్వాగతం పలికింది. అమెరికాలో భారతదేశ రాయబారి తరణ్‌జిత్ సింగు సంధూ కూడా వచ్చారు. నమస్తే యుఎస్‌ఎ అని ప్రధానికి ఆయన స్వాగతం పలికారు. ఉదయం నుంచి భారతీ వర్షాలు పడుతున్నప్పటికీ అత్యధిక సంఖ్యలోనే ఇండో అమెరికన్లు ఇక్కడి అండ్రూస్ జాయింట్ ఎయిర్‌ఫోర్సు స్థావరానికి ప్రధానిని ఆహ్వానించేందుకు తరలివచ్చారు.

శుక్రవారం మోడీకి బైడెన్ ఆతిధ్యం

శుక్రవారం ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వైట్‌హౌస్‌లో ఆతిధ్యం ఇస్తారు. తొట్టతొలి ముఖాముఖి క్వాడ్ సదస్సు జరుగుతుంది. భారత్ తరఫున ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా ఈ భేటీలో పాల్గొంటారు. కోవిడ్, పర్యావరణం, ఉగ్రవాదం వంటి కీలక అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయి. అయితే చైనా ప్రాబల్యపు ధోరణిని నిలువరించే దిశలో కలిసికట్టు వ్యూహాలపై అంతర్గత మంతనాలు ఉంటాయని భావిస్తున్నారు. భారతీయ సంతతి మహిళ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కూడా ప్రధాని సమావేశం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News