Home జాతీయ వార్తలు మోడీ బహుమతుల వేలంలో అనూహ్య స్పందన

మోడీ బహుమతుల వేలంలో అనూహ్య స్పందన

MODIమోడీ ఫోటోస్టాండ్, వెండి కలశం ఒక్కోదాని ధర రూ.కోటి

న్యూఢిల్లీ : గత ఆరు నెలల్లో ప్రధాని నరేంద్ర మోడీకి దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బహుమతులను వేలం వేసే ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆయా బహుమతులకు గిరాకీ పెరిగి ధర కూడా ఊహించలేనంత విధంగా పలుకుతోంది. ఇప్పటివరకు 2772 బహుమతులు వేలంలో అమ్మకానికి సిద్ధం అయ్యాయి. అయితే ఇందులో మోడీ ఫోటోస్టాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు దీని అసలు ధర కేవలం రూ.500 అయినప్పటికీ సోమవారం వేలంలో కోటి రూపాయల వరకు ధర పలకడం విశేషం.

ఈ ఫోటోస్టాండ్‌పై ప్రధాని సందేశం గుజరాత్‌లో రాసి ఉండడం మరీ ఆకర్షణ. ఇదే విధంగా వెండి కలశం అసలు ధర రూ.18000 కాగా, రూ. కోటి వరకు ధర పలికింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ దీన్ని మోడీకి బహూకరించారు. వీటితోపాటు కత్తులు, కటార్లు శాలువాలు పెయింటింగులు, వెయ్యికి మించి మోడీ చిత్రపటాలు, వేలంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ న్యూఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్టు నుంచి తీసుకొచ్చినవే. ఈ విధంగా వేలం వేయగా వచ్చిన డబ్బంతా గంగా శుద్ధి ప్రాజెక్టు కోసం వినియోగించడానికి నిర్ణయించారు.

PM Modi gifts Rs 1 crore in auction