Home జాతీయ వార్తలు జిన్‌పింగ్‌కు మోడీ విశేష కానుకలు

జిన్‌పింగ్‌కు మోడీ విశేష కానుకలు

PM Modi

 

మహాబలిపురం : చైనా అధినేత జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ మహాబలిపురంలో అపురూపమైన కానుకలను అందించారు. నృత్య సరస్వతి చిత్రపటం, నచియార్‌కోయిల్ హంస దీపం బహుమతిని ఇచ్చారు. విశేష ఖ్యాతి గడించిన తంజావుర్ చిత్రకారుడు బి లోగనాథన్ రూపొందించిన నృత్య సరస్వతి అత్యంత అరుదైనదిగా అలరించింది. 16వ శతాబ్దపు చిత్ర కళారూపమైన తంజావూర్ చిత్రకళను చైనా అధినేతకు ఈ పటంతో మోడీ పరిచయం చేశారు. నాయక, మరాఠా రాజుల పాలనలో ఈ కళ విలసిల్లింది. ఇక హంస దీపాన్ని ఎనిమిది మంది నిపుణులు అత్యంత ఆకర్షణీయమైన శాఖాదీపాలతో రూపొందించారు. చారిత్రక కట్టడాల వీక్షణ, ఇక్కడి తియ్యటి కొబ్బరి నీరు సేవనం, నృత్యరూపకాల వీక్షణం తరువాత చైనా అధినేత ఈ అందమైన కానుకల స్వీకరణం చేశారు.

PM Modi gifts Xi Jinping Annam lamp, Thanjavur painting