Home జాతీయ వార్తలు మోడీ అధ్యక్షతన 28 న అఖిల పక్ష సమావేశం

మోడీ అధ్యక్షతన 28 న అఖిల పక్ష సమావేశం

PM Modi likely to attend all-party meeting on Nov 28

 

న్యూఢిల్లీ : ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఈనెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనున్నది. ఉభయసభలకు సంబంధించి అన్ని పార్టీల సభాపక్షనేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సమావేశానికి హాజరవుతారు. ఆదివారం సాయంత్రం రాజ్యసభ అధ్యక్షులు వెంకయ్యనాయుడు రాజ్యసభలోని సభా పక్షనాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అదే విధంగా లోక్‌సభ లోని సభా పక్షనేతలతో శనివారం 27 న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది.

PM Modi likely to attend all-party meeting on Nov 28