Home అంతర్జాతీయ వార్తలు సౌదీ రాజుతో మోడీ భేటీ

సౌదీ రాజుతో మోడీ భేటీ

PM Modi, Saudi Arabia King
సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. అర్జెంటీనాలో జరుగుతున్న జి20 సమావేశాల నేపథ్యంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇంధనం, ఆర్థిక, సాంస్కృతిక తదితర కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆహార భద్రతపై పెట్టుబడులను పెంచే అంశంపై చర్చలు జరిపారు. సౌదీ రాజుతో భేటీపై ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… మహ్మద్ బిన్ సల్మాన్ తో చర్చలు ఫలప్రదంగా సాగాయని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించామన్నారు.
PM Modi Meets King of Saudi Arabia