Saturday, April 20, 2024

అమరవీరులకు మోడీ, అమిత్ షా నివాళులు

- Advertisement -
- Advertisement -

PM Modi pays tribute to police martyrs

న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నివాళులర్పించారు. పోలీసుల అమరవీరుల త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందని ప్రధాని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో వారెప్పుడూ అలసత్వం ప్రదర్శించలేదన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం నుండి, భయంకరమైన నేరాలను పరిష్కరించడం వరకు, విపత్తు నిర్వహణలో సహాయం నుండి కోవిడ్-19తో పోరాటం వరకు, ఇలా ప్రతి సంక్షోభంలోనూ పోలీసులు ముందు వరసలో ఉండి పోరాటం చేస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. పోలీసు స్మారక దినోత్సవం భారతదేశం అంతటా ఉన్న పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసు స్మారక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. “ఇప్పటివరకు 35,398 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్-19 కి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో దేశానికి సేవ చేస్తున్నప్పుడు 343 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.” అని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద జరిగిన పోలీసు స్మారక దినోత్సవ కవాతులో అమిత్ షా తన ప్రసంగించారు.  “ఈ స్మారకం కేవలం ఇటుకలు, సిమెంటుతో చేసినది కాదు, ఈ స్మారకం మన సైనికుల బలిదానాన్ని గుర్తుచేస్తుంది. ప్రాణాలను అర్పించిన ధైర్య సైనికులకు మేము వందనం చేస్తున్నాము.” అని హోంమంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News