Home జాతీయ వార్తలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శిలాపూజ

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శిలాపూజ

PM Modi Performs Bhoomi Puja For Ram Mandirలక్నో : అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ చేసే నేథ్యంలో  ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం రామాలయ శిలాపూజ చేశారు. వేదపండితులు మంత్రాలు చదువుతుండగా హిందూ సాంప్రదాయం ప్రకారం మోడీ శిలా పూజ చేశారు. తొలుత మోడీ వినాయక పూజ చేశారు. ఈ పూజ కోసం తొమ్మిది శిలలను వాడారు. జల, పుష్పాలతో మోడీ పూజలు చేశారు. వేద పండితులు మోడీ చేత సంకల్ప మంత్రం చదివించారు. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, యుపి గవర్నర్ ఆనందీబెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లతో పాటు 17 మంది ప్రముఖులు ఈ  పూజలో పాల్గొన్నారు.