Tuesday, July 8, 2025

ట్రంప్ విందు కన్నా జగన్నాథుడి దర్శనమే మిన్న

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఇటీవల జి.7 సదస్సు నేపథ్యంలో కెనడా వెళ్లానని, అక్కడికి చేరుకున్న తర్వాత ట్రంప్ ఫోన్ చేసి అమెరికా రావాలని కోరారని, అయితే తనకు మహాప్రభు పూరీ జగన్నాథుడి కన్నా ఏదీ ముఖ్యం కాదని ఆయనకు సున్నితంగా చెప్పినట్లు తెలిపారు. జగన్నాథుడి కన్నా తనకు ఏదీ ఎక్కువ కాదని అన్నారు. శుక్రవారంనాడు ఒడిషాలో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ఇక్కడ జరిగిన సభలో మాట్లాడారు. ఏవైనా అదనపు కార్యక్రమాలు ఉంటే వాటిని పక్కకు పెట్టి అమెరికా రావాలని, విందు సందర్భంగా పలు విషయాలు చర్చించుకుందామని ట్రంప్ కోరినట్లు మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తనకు ఒడిషాలో మహాప్రభు భూములు అప్పగించే కార్యక్రమం ఉన్నందున అమెరికాకు వెళ్లకుండా ఇక్కడికి వచ్చానని వివరించారు. ఇక్కడి ప్రజల ప్రేమ ఆదరణ, మహాప్రభు పట్ల భక్తిభావన తనను ఇటువైపు నడిపించాయని తెలిపారు. ఒడిషాలో తొలిసారిగా ఏర్పడ్డ బిజెపి ప్రభుత్వ ఏడాది పాలన నేపథ్యంలో ఏర్పాటు అయిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ఒడిశాలో బిజెపి ప్రభుతం ఏర్పాటైనప్పటి నుంచి సామాజిక, ఆర్థిక రంగాల్లో నవశకం ప్రారంభమైందని అన్నారు. పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని తెరవాలన్న ప్రజల కోరికను తాము నెరవేర్చినట్లు మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News