Home జాతీయ వార్తలు ఐక్యతా ప్రతిమకు ‘నమో’ మి!

ఐక్యతా ప్రతిమకు ‘నమో’ మి!

కేవడియా(గుజరాత్): ప్రధాని నరేంద్ర మోడీ తన 69వ జన్మదినం సందర్భంగా మంగళవారం తన స్వరాష్ట్రం గుజరాత్‌ను సందర్శించారు. సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద ప్రతిష్టించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన ఆయన ఐక్యతా ప్రతిమకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. మహానాయకుడు సర్దార్ పటేల్‌కు భారత్ ఇచ్చిన ఘననివాళిగా ఆ ఐక్యతా ప్రతిమను ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పరిగణిస్తున్న ఐక్యతా ప్రతిమను గత ఏడాది అక్టోబర్ 31న ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అంతకుముందు, నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకున్న సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నమామి నర్మద ఉత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. 2017లో ఈ డ్యామ్ ఎత్తున పెంచిన తర్వాత మొట్టమొదటిసారి ఆదివారం సాయంత్రానికి ఈ జలాశయం నీటి మట్టం 138.60 మీటర్ల పూర్తిస్థాయికి చేరుకుంది.
PM Modi Shares Majestic View of Statue of Unity, The Statue of Unity, billed as the tallest in the world, was inaugurated by him on Sardar Vallabhbhai Patels birth anniversary on October 31 last year.