Thursday, March 28, 2024

‘ఆందోళన జీవులూ’ ఉన్నారు: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ప్రోత్సహిస్తున్న వారిపై విరుచుకు పడ్డారు. ఇటువంటి ఆందోళనలను నిర్వహిస్తున్న వారిని కొత్త జాతికి చెందిన ఆందోళనకారులుగా ‘ఆందోళన జీవులు’గా అభివర్ణించారు. మనకు శ్రమజీవులు, బుద్ధి జీవుల గురించి తెలుసునని, కానీ ‘ఆందోళన జీవులు’ కూడా ఉన్నారని, ఇటువంటి వారు ఆందోళనలు చేయకుండా జీవించలేరని, ఇటువంటి వారినుంచి మన దేశం రక్షణ పొందాలని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను క్లుప్తంగా ఎఫ్‌డిఐ అని చెప్పడం పరిపాటి. అయితే, ఎఫ్‌డిఐకి మోడీ కొత్త నిర్వచనం చెప్పారు. మన దేశంలో కొత్తరకం ఎఫ్‌డిఐ తయారైందని చెప్పారు. ‘ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ’ (విదేశీ విధ్వసకర భావజాలం) తయారైందని అన్నారు.

PM Modi slams Oppn in Lok Sabha over farm Laws

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News