Friday, March 29, 2024

స్వల్పంగా పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. తాజా డిక్లరేషన్ ప్రకారం ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది రూ.3.07 కోట్లకు పెరిగింది. ప్రధాని వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంచారు. మోడీకి రూ.1.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మార్చి 31 నాటికి ఆయన వద్ద రూ.36,000 నగదు రూపంలో ఉంది. గాంధీనగర్ బ్రాంచ్ ఎస్‌బిఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఆయన ఆదాయంలో ఈ స్పల్ప పెరుగుదల చోటుచేసుకుంది. ఆయనకు సొంత వాహనం లేదు. ప్రధానికి గాంధీనగర్ సెక్టార్-1 లో సొంత ఫ్లాట్ (నెం.401/ఎ) ఉంది. దీనికి మరో ముగ్గురు జాయింట్ ఓనర్లు ఉన్నాయి. ఇందులో అందరికీ సమానమైన వాటా ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి రెండు నెలల ముందు 2002 అక్టోబర్ 25న ప్రధాని ఈ ఆస్తి కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ఆస్తి విలువ రూ.1.3 లక్షలు ఉంది. 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి కొత్త ఆస్తులు కొనుగోలు చేయలేదని డిక్లరేషన్‌లో మోడీ పేర్కొన్నారు.

PM Modi Slightly Richer than last year

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News