Saturday, April 20, 2024

లడక్ లడాయికి రెడీ?

- Advertisement -
- Advertisement -

PM modi talks with Doklam Team

 

యుద్ధ తంత్ర దళాలతో భారత్ సిద్ధం
డొక్లామ్ టీంతో ప్రధాని సమాలోచనలు
అపసవ్యం వద్దని చైనాకు హెచ్చరిక

న్యూఢిల్లీ / లడక్ : చైనా సరిహద్దులలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి భారతదేశం అత్యున్నత స్థాయి యుద్ధ నైపుణ్య సైనిక బలగాలను రంగంలోకి దింపింది. చైనా సైనిక బలగాలు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) నుంచి ఎదురయ్యే ఎటువంటి సవాలు అయినా తిప్పికొట్టేందుకు సమాయత్తం అయింది. మరో వైపు పరిస్థితిని సమీక్షించుకునేందుకు, తగు విధంగా స్పందించేందుకు ప్రధాని మోడీకి నమ్మకమైన డొక్లామ్ బృందం రంగంలోకి దిగింది. గత కొద్దిరోజులుగా భారత్, చైనా సైనిక బలగాల మధ్య తీవ్రస్థాయిలో కవ్వింపు చర్యలు చోటుచేసుకున్నాయి. ఇవి చివరికి పరస్పరం తలపడే దశకు చేరుకున్నాయి. దౌలత్ బెగ్ ఓల్డీ (డిబిఒ) సెక్టార్‌లో చైనా ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో మౌలిక సైనిక కేంద్రా ల ఏర్పాట్లు, సరిహద్దులలో నిర్మాణ పనులను చేపట్టింది. వీటిని నివారించేందుకు భారతప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ప్రయత్నాలను వమ్ముచేస్తూ చైనా పిఎల్‌ఎ బలగాలను పెద్ద ఎత్తున రంగంలోకి దింపడంతో ఎల్‌ఎసి వెంబడి ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

సరిహద్దులలో చైనా నిర్మాణ పనులు జోరందుకుంటే అక్సా య్ చిన్ ప్రాంతంలోని లహసా కశ్‌గర్ హైవే వెంబడి భారత్‌కు సవాలు ఏర్పడుతుంది. చైనా ప్రయత్నాలను దెబ్బతీసేందుకు లడక్ తూర్పు ప్రాంత సైనిక బలగాలకు తోడుగా ఉండేందుకు పూర్తిస్థాయి శిక్షణ పొందిన సైనిక బలగాలు చేరుకున్నాయి. ఈ ప్రత్యేక బృందాలకు చైనాకు చెందిన టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం పరిస్థితులు, అక్కడి నైసర్గిక స్వరూపం గురించి బాగా తెలుసు. అంతేకాకుండా అతిక్లిష్టమైన, అసాధారణ శిఖర ప్రాం తాల్లో కార్యనిర్వహణ అనుభవం ఉంది. మరో వైపు చైనా ఈ ప్రాంతంలోకి రెండు బ్రిగేడ్‌ల స్థాయిని మించి దళాలను దింపింది. ఇంత పెద్ద సంఖ్యలో బలగాలను దింప డం చైనా అత్యున్నత స్థాయి నాయకత్వ పరిధిలో తీసుకునే నిర్ణయంగా భావిస్తున్నారు. ఇది స్థానిక సైనిక దళాధినేతల పరిధిలో జరిగే చర్య కాదని విశ్లేషిస్తున్నారు.

చైనా ఆధిపత్య ధోరణికి ఇది తార్కాణం: ఇండియా

ఇన్నేళ్లుగా పలు విషయాలలో చైనా వ్యవహరిస్తున్న తీరు ఆ దేశ గుత్తాధిపత్య ధోరణిని తెలియచేస్తుందని భారతదేశం స్పందించింది. సరిహద్దులలో ప్రస్తుత పరిణామాలపై ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడారు. ఆస్ట్రేలియా నుంచి హాంగ్‌కాంగ్, అక్కడి నుంచి తైవాన్ , తైవాన్ నుంచి సౌత్ చైనా సీ అక్కడితో ఆగక ఇండియా, చివరికి భారతదేశంతో వివాదాల వ్యవహారాలతో జగడాలమారి చైనా ధోరణి అర్థం అవుతోందని ఈ అధికారి తెలిపారు. తానే అంతా అనే ధోరణితో ముందుకు సాగాలనే రీతిలో ప్రపంచం పట్ల చైనా ప్రవర్తన ఉందని వ్యాఖ్యానించారు.

డొక్లామ్ టీం సిద్ధం

చైనా సవాలును తిప్పికొట్టే వ్యూహంపై ప్రధాని జరిపిన సమాలోచనలకు డోక్లామ్ బృందంగా పేరొందిన ముగ్గురు ప్రముఖులు హాజరయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ బలగాల అధినేత బిపిన్ రావత్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కూడిన ముగ్గురి అత్యున్నత స్థాయి బృందాన్ని డోక్లామ్ టీంగా వ్యవహరిస్తున్నారు. మూడేళ్ల తరువాత ఈ బృందం పరిస్థితిని ఎదుర్కొనే వ్యూహాల ఖరారుకు ప్రధానితో భేటీ అయింది. చైనాతో 2017లో తలెత్తి ఏకంగా 73 రోజుల పాటు సాగిన డొక్లామ్ ప్రతిష్టంభన నివారణకు ఈ బృందం అప్పట్లో రంగంలోకి దిగింది. అప్పట్లో జైశంకర్ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. రావత్ అప్పుడు ఆర్మీచీఫ్‌గా వ్యవహరించారు.

పద్ధతి ప్రకారమే గస్తీ : భారత ప్రభుత్వ వివరణ

భారత్ చైనా మధ్య సుదీర్ఘ సరిహద్దుల వెంబడి ఇటీవలి కాలంలో ఘర్షణాయుత వాతావరణం నెలకొంది. తాము పద్ధతి ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు ఈ దశలో భారత ప్రభుత్వం బుధవారం తెలిపింది. తమ భూభాగం పరిధిలోనే భారతీయ సైన్యం కార్యకలాపాలు నిర్వహిస్తోందని, సరిహద్దు నిర్వహణలో ఎప్పుడూ సవ్యంగా వ్యవహరిస్తున్నామని భారత విదేశాంగశాఖ ప్రకటనలో తెలిపారు. తమది బాధ్యతాయుత ధోరణి అని స్పష్టం చేశారు. దేశ ప్రాదేశికత, భద్రతల విషయంలో రాజీ ఉండబోదని తెలిపారు. తమ బలగాలు అతిక్రమణలకు దిగాయనే వాదన అవాస్తవం అని, వెస్టర్న్ సెక్టర్‌లోకానీ సిక్కింలోకానీ తాము పద్థతి ప్రకారమే ఉన్నామని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ప్రకటించారు. సరిహద్దుల వెం బడి ఎల్‌ఎసి పరిధిలో ఏర్పాట్లు, సమీకరణల విషయంపై భారతీయ సైనిక దళాలు పూర్తి స్థాయిలో నిర్థిష్ట పద్ధతిలో వ్యవహరిస్తున్నాయని, నిబంధనలకు కట్టుబడి ఉంటున్నామని, దీనిని కాదనడం పద్ధతి కాదని తేల్చిచెప్పారు.

లడక్, ఉత్తర సిక్కింల్లో భారీ స్థాయిలో సైనిక మొహరింపులు జరిగాయి. దీనితో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. రెండు సార్లు ఇరు బలగాల మధ్య తలపడే స్థితి ఏర్పడింది. అతిక్రమణలు జరుగుతున్నాయంటూ ఇరు పక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి. తమ బలగాల సాధారణ గస్తీకి చైనా బలగాలు అడ్డుతగులుతున్నాయని భారతదేశం ఆరోపించింది. అయితే తమ భూభాగంలోకి భారత సైనికులు గస్తీ పేరిట చొచ్చుకుని వస్తున్నారని చైనా ప్రతివిమర్శకు దిగింది. అయితే భారత విదేశాంగ శాఖ వెలువరించిన సమగ్ర ప్రకటనలో అన్ని విషయాలను స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News