Home జాతీయ వార్తలు వన్ నేషన్- వన్ హెల్త్‌కార్డు!

వన్ నేషన్- వన్ హెల్త్‌కార్డు!

 దేశ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త కానుక, నేడు ఎర్రకోట వేదికగా ప్రకటన చేసే అవకాశం
 దేశవ్యాప్తంగా 74వ పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు

PM Modi to address nation from red fort for 7th time

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సర్వసన్నద్ధమైంది. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సాదాసీదా ఏర్పాట్ల నడుమ అత్యంత తక్కువ మంది అతిథులతో వేడుకలు జరుగనున్నాయి. ఉదయం సరిగ్గా 7.30గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం ఆయన ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా విజృంభణ, చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపధ్యంలో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ సారి మోడీ ఎర్రకోట మీదుగా ‘వన్ నేషన్‌హెల్త్ కార్డు’ అనే కొత్త పథకాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. కొవిడ్ కారణంగా భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఈ సారి 4వేల మంది అతిథులకే ఆహ్వానాలు పంపినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఈ సారి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన నలుగురు సైనికులకు శౌర్యచక్ర పతకాలు ప్రకటించారు.

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి ‘ఒక దేశం ఒకే ఆరోగ్య కారు’్డ(వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు) పథకాన్ని ప్రకటించే అవకాశముందనిభావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడం కోసం ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతి వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్రను అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. ఆస్పత్రులు, క్లినిక్‌లు, వైద్యులను కేంద్ర సర్వర్‌తో అనుసంధానిస్తారు. అయితే ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనేదాన్ని పూర్తిగా పౌరులు, ఆస్పత్రుల ఇష్టానికే వదిలేస్తారు.
యూనిక్ ఐడి
ఈ కార్డును కోరుకునే వారికి ఒక యూనిక్ ఐడిని కేటాయిస్తారు. ఈ ఐడి ద్వారావారు సిస్టమ్‌లోకి లాగిన్ అవుతారు. దశలవారీగాఅమలు చేసే ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారు. ఈ పథకం వల్ల లభించే ముఖ్య ప్రయోజనం ఏమిటంటే దేశంలో ఏ వైద్యుడు, లేదా ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్కిప్షన్లు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిక్ ఐడి ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలిస్తారు. ఆధార్ కార్డు తరహాలోనే హెల్త్ కార్డును జారీ చేస్తారు. దేశంలో వైద్య ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉండేలా చర్యలు చేపడతారు. ఈ పథకాన్ని తర్వాత మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్‌తో అనుసంధానిస్తారు. రోగి అనుమతితోనే వైద్యులు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతిస్తారు. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గతంలో మాదిరి ఆర్భాటంగా జరగే అవకాశాలు లేవు. అంతేకాకుండా ప్రధాని ప్రసంగంలో ఇంతకు ముందులాగే భారీ పథకాలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఉండకపోవచ్చు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను వివరించడంతో పాటుగా ప్రజలకు ధైర్యాన్ని, ఊరటను కల్పించడానికి ప్రధాని తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని కేటాయిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, దేశ ఆర్థిక పరిస్థితికి ఊతమిచ్చే అంశాలను కూడా ప్రధాని ప్రస్తావించే అవకాశముంది.
4 వేల మందికి ఆహ్వానాలు
కాగా, శనివారం ఎర్రకోట వద్ద జరగబోయే స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు దౌత్యవేత్తలు, అధికారులు, మీడియా ప్రతినిధులతో కలిపి 4000 మందికి పైగా ఆహానితులను ఆహ్వానించినట్ల్లు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ప్రతిఏటా నిర్వహించే విధంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రతిష్ఠను కాపాడుతూనే మరో వైపు కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ శా తెలిపింది. అతిథుల మధ్య ఆరడుగుల దూరాన్ని కొనసాగిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే గార్‌డఆఫ్ ఆనర్ కార్యక్రమంలో పాల్గొనే వలంటీర్లను క్వారంటైన్‌లో ఉంచినట్లు కూడా తెలిపింది. అతిథులందరినీ మాస్కులు ధరించి రావలసిందిగా కోరామని, వేదిక వద్ద వివిధ ఎంట్రీపాయింట్ల వద్ద పంపిణీ చేయడం కోసం తగినన్ని మాస్కులు కూడా సిద్ధంగా ఉంచుతున్నట్లు కూడా రక్షణ శాఖ తెలిపింది.

PM Modi to address nation from red fort for 7th time