Home జాతీయ వార్తలు 9న ప్రధాని మోడీ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు

9న ప్రధాని మోడీ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు

PM Modi to chair 13th brics summit on september 9

 

న్యూఢిల్లీ : ఐదు దేశాల బ్రిక్స్ 13 వ వార్షిక సదస్సుకు ఈనెల 9 న ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తారు. వర్చువల్‌గా జరగనున్న ఈ సదస్సులో ప్రధానంగా అఫ్గానిస్థాన్ పరిస్థితిపైనే కేంద్రీకరించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, బ్రెజిల్ దేశాధినేత జెయిర్ బొల్సొనారో ఈ సదస్సుకు హాజరవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సదస్సులో భారత్ చర్చించడానికి బహుళ పక్ష వ్యవస్థ సంస్కరణలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ప్రజల మధ్య పరస్పర అబిప్రాయ మార్పిడి తదితర కీలక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి నిర్ణయించింది.