Tuesday, March 19, 2024

ప్రధాని మోడీ చేతుల మీదుగా కుశినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -
PM Modi to inaugurate Kushinagar International Airport
శ్రీలంక నుంచి 100 మందికి పైగా ప్రముఖుల బృందంతో
ల్యాండింగ్ కానున్న తొలి విమానం

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం కుశినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రాంభించడంతో పాటుగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రరంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ మత పర్యాటక ప్రాంతాలను నేరుగా అనుసంధానం చేసే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి ముందు ప్రధాని కుశినగర్‌లోని మహాపరినిర్వాణ ఆలయంలో అభిధమ్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) తెలియజేసింది. శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, దక్షిణ కొరియా, నేపాల్, భైటాన్, కంబోడియా దేశాలకు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసులు, వివిధ దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
శ్రీలంకనుంచి వంద మందికి పైగా బౌద్ధ సన్యాసులు, ప్రముఖుల బృందంతో తొలి విమానం ఎయిర్‌పోర్ట్‌లో లాండింగ్ కావడంతో విమానాశ్రయం ప్రారంభమవుతుందని పిఎంఓ తెలిపింది.

బుద్ధుడి అవశేషాలను ప్రదర్శించడం కోసం అవశేషాలను తీసుకువస్తున్న 12మంది సభ్యులు కూడా ఈ బృందంలో ఉన్నారు. అలాగే శ్రీలంకలోని బౌద్ధ మతానికి చెందిన నాలుగు నికటాల అనునాయక్‌లు(ఉప అధిపతులు), శ్రీలంక ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులు కూడా ఈ బృందంలో ఉన్నారు. గౌతమ బుద్ధుడు మహా పరినిర్వాణం చెందినస్థ్థమైన కుశానగర్‌ను ప్రంచంలోని ఇతర బౌద్ధ పవిత్ర స్థలాలను అనుసంధానం చేసే ఉద్దేశంతో చేపట్టిన ఈ విమానాశ్రయాన్ని రూ.260 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయం యుపి, బీహార్‌కు చెందిన సమీప జిల్లాల అవసరాలను తీర్చడంతో పాటుగా ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి, స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి కూడా దోహదపడుతుంది. ప్రధాని కుశినగర్‌లో రూ.250 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రాజ్‌కియా మెడికల్ కాలేజికి కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే మరో రూ.180 కోట్ల విలువైన 12 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు కూడా చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News