3న ఇన్ఫినిటీ ఫోరమ్ ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలోని స్టేక్హోల్డర్ల సంప్రదాయిక ఆలోచన ధోరణిని ‘ఇన్ఫినిటీ ఫోరమ్’ మార్చుతుందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తెలిపారు. స్పేస్ టెక్, గ్రీన్ టెక్, ఆగ్రి టెక్, క్వాటమ్ కంప్యూటింగ్, ఇతరములలో సంప్రదాయిక ఆలోచనా ధోరణికి భిన్నంగా కొత్త ట్రెండ్ల అనుసరణకు, చర్చకు అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఆయన డిసెంబర్ 3న ఫిన్ టెక్‌పై ఏర్పాటైన ఆలోచనా నాయకత్వ వేదిక ‘ఇన్ఫినిటీ ఫోరమ్’ను ప్రారంభించబోతున్నారు. “ఇన్ఫినిటీ ఫోరమ్ ప్రారంభోత్సవ సందర్భంగా ‘బియాండ్’ అనే ఆసక్తికర కార్యక్రమం కూడా శుక్రవారం (డిసెంబర్ 3న) ఉదయం 10.00 గంటలకు ఉంటుంది. ఈ ఆలోచనా నాయకత్వ వేదిక ఫిన్టెక్కు సంబంధించిన అంశాలు, సమ్మిళిత వృద్ధి(ఇన్‌క్లూజివ్ గ్రోత్)లో దానిని ఉపయోగించడంపై దృష్టి సారిస్తుంది” అని ఆయన ట్వీట్ చేశారు. అంకుర సంస్థలు(స్టార్టప్స్), టెక్, వినూత్న రంగాలలో ఉన్న యువత ఇన్ఫినిటీ ఫోరమ్ గురించి మరింత తెలుసుకోవాలని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
PM Modi to inaugurated InFinity forum on dec 3