Thursday, April 25, 2024

రేపు ప్రధాని ద్వారా ప్రాపర్టీ కార్డుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

PM Modi to launch distribution of property cards

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రజలకు ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. స్వమిత్వా (స్వీయ యాజమాన్యం) పథకం పరిధిలో వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియ ద్వారా ప్రాపర్డీ కార్డుల పంపిణీ ఆరంభం అవుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గ్రామీణ భారత పరివర్తన దిశలో ఇది ఓ చారిత్రక నిర్ణయం అవుతుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రజానీకం తమకుండే స్థిరాస్తుల ద్వారా ఎప్పటికప్పుడు అవసరం అయిన రుణాలు తీసుకునేందుకు ఇతరత్రా లాభాలు దక్కించుకునేందుకు ఈ ప్రాపర్డీ కార్డులు ఉపయోగపడుతాయి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు లక్ష మంది వరకూ ఈ ప్రాపర్టీ కార్డులను వారివారి మొబైల్ ఫోన్లకు పంపించిన ఎస్‌ఎంఎస్ లింక్ ద్వారా వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత వారికి క్రమేపీ వ్యక్తిగతంగా ఈ ప్రాపర్డీ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఆరు రాష్ట్రాలలోని 763 గ్రామాలకు చెందిన వారికి ఈ ప్రాపర్టీ కార్డులు తొలిదశలో అందుతాయి. స్వంవితా పరిధిలో ఈ ప్రాపర్టీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించే దశలో ప్రధాని మోడీ కొందరు లబ్ధిదారులతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తారని కూడా ప్రధాని కార్యాలయం తెలిపింది. పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ స్వంవితా పథకాన్ని ప్రధాని మోడీ ఎప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ప్రకటించారు.

PM Modi to launch distribution of property cards

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News