Friday, April 19, 2024

వలస కార్మికుల కోసం.. ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పథకం

- Advertisement -
- Advertisement -

Nirmala

న్యూఢిల్లీః వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 20వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోలోయిన వలస కారికులు ఈ పథకంతో ఉపశమనం పొందుతారని నిర్మలా పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ వంటి ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలకు చెందిన వలస కార్మికులు స్వరాష్ట్రాలకు తిరిగొచ్చారని, 125 రోజుల్లో ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్‘ పథకం కింద వలస కార్మికులకు 25 ప్రాజెక్టు పనుల్లో ఉపాధి కల్పన చర్యలు చేపడుతామన్నారు. వలస కార్మికులు ఆయా జిల్లాల్లోని గ్రామాలు కామన్ సర్వీస్ సెంటర్లు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చని మంత్రి నిర్మలా తెలిపారు.

PM Modi to launch Garib Kalyan Yojana scheme on Jun 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News