న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువున్న రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్షిస్తున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంపై చర్చిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై సిఎంలతో చర్చలు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. దేశంలో కోవిడ్ -19 పరిస్థితి, వైరస్ నిరోధక వ్యూహాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించడానికి ప్రధాని ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక కీలకమైన సమావేశాలను నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తన ఎన్నికల ర్యాలీలను ప్రధాని రద్దు చేసిన తరువాత సమావేశాలు షెడ్యూల్ చేయబడ్డాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు, ఆక్సిజన్ సరఫరాను సమీక్షించడానికి దేశంలోని కొన్ని ప్రముఖ ఆక్సిజన్ తయారీదారులతో మోడీ సమగ్ర సమావేశం నిర్వహిస్తారు. కాగా, భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.
PM Modi Video Conference with all state CMs